https://oktelugu.com/

Rathika Rose- Prince Yawar: ప్రిన్స్ తో పులిహోర కలపడం స్టార్ట్ చేసిన రతిక…

నిన్నటి వరకు అందరి ముందు ప్రశాంతతో క్లోజ్ గా ఉండి పులిహోర కలిపిన విషయం కూడా పక్కన పెట్టి.. శివాజీ ,పల్లవి ప్రశాంత్ పక్కన ఉండగానే బిగ్ బాస్ నేను రతకిను ఇష్టపడుతున్నాను అంటూ డైరెక్ట్ గా ప్రపోజ్ చేశాడు.

Written By:
  • Vadde
  • , Updated On : September 16, 2023 / 11:49 AM IST

    Rathika Rose- Prince Yawar

    Follow us on

    Rathika Rose- Prince Yawar: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍ కాన్సెప్ట్ ఉల్టా పుల్టా…దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కటి ఉల్టా పుల్టా గానే జరుగుతుంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లే కాదు కంటెస్టెంట్స్ ప్రవర్తన కూడా రోజుకో రకంగా ఉంది. రెండవ వారంలో .. ఎలిమినేషన్ నుంచి బయటపడేసి మరొక నాలుగు వారాల పాటు ఇమ్యూనిటీ ఇచ్చే పవర్ ఆస్త్రా దక్కించుకోవడం కోసం మాయా అస్త్రాన్ని సంపాదించిన టీం లోని ఆరుగురు మధ్య గట్టి పోటీ నడిచింది. అయితే ఫైనల్ గా వీళ్ళ ఆరు మందిలో శివాజీ ,షకీలా పవర్ అస్త్ర సంపాదించడానికి అర్హత పొందారు.

    అయితే ఈ నేపథ్యంలో మహాబలి టీం కెప్టెన్ గౌతమ్ కృష్ణ…కండల వీరుడు రణధీర టీం మెంబర్ ప్రిన్స్ యావర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పటివరకు శివాజీ ,షకీలా కి సపోర్ట్ ఇస్తూ వచ్చిన రతిక..యావర్ గొడవ తర్వాత మాట మార్చేసింది. యావర్ కంటే షకీలా కు ఉన్న అర్హత ఏంటి అంటూ గొడవ మొదలుపెట్టింది. పాపం ఈ రతిక సపోర్ట్ చేయడంతో పొంగిపోయిన ప్రిన్స్ రతికపై మనసు పారేసుకున్నాడు.

    నిన్నటి వరకు అందరి ముందు ప్రశాంతతో క్లోజ్ గా ఉండి పులిహోర కలిపిన విషయం కూడా పక్కన పెట్టి.. శివాజీ ,పల్లవి ప్రశాంత్ పక్కన ఉండగానే బిగ్ బాస్ నేను రతకిను ఇష్టపడుతున్నాను అంటూ డైరెక్ట్ గా ప్రపోజ్ చేశాడు. తనతో చాలా క్లోజ్‍గా మూవ్ అవుతున్న ప్రిన్స్ విషయంలో రతిక కూడా ఎంకరేజింగ్ గానే వ్యవహరిస్తుంది. ఐ లైక్ యూ అని అన్నపుడు…ఐ లైక్ యు టూ అని రతిక రిప్లై ఇచ్చింది.

    ఈ తమాషా చూస్తున్న శివాజీ.. అది సరే మరి అబ్బాయిల్లో ఎవరు ఇష్టం అని అడిగితే దానికి ప్రిన్స్ అబ్బాయిల్లో ఎవరూ లేరు…అమ్మాయిలే అని అనడంతో రతిక.. అదేదో పెద్ద జోక్ లాగా పడి పడి నవ్వింది.తర్వాత రతిక బాల్కనీలో నిలబడి ఉన్నప్పుడు..ప్రిన్స్ గార్డెన్ ఏరియాలో నిలబడి
    నా గుండె నీకోసమే కొట్టుకుంటుంది అన్నట్లుగా చేతులతో హార్ట్ సింబల్ చూపించాడు. దానికి వెంటనే రియాక్ట్ అయిన రతిక తన చేతులతో హార్ట్ సింబల్ వేసి చూపించింది. ఇదంతా గమనిస్తున్న పల్లవి ప్రశాంత్ ప్రిన్స్ ను నువ్ రతికను లవ్ చేస్తున్నావా అని అడగగా…తనది ఎంతో మంచి హార్ట్ అని నాకు ఇవాళ అర్థమైంది అని రిప్లై ఇచ్చాడు.

    అయితే ఆ మాటకి షాక్ అయిన పల్లవి ప్రశాంత్…అదంతా నమ్మకురా నాయనా.. ఇప్పుడు అలాగే ఉంటుంది తర్వాత నీకే అర్థమవుతుంది..అని అన్నాడు.ఆ తర్వాత
    బాల్కనీలో కూర్చున్న శోభా శెట్టి, రతిక..ప్రిన్స్ గురించి డిస్కస్ చేసుకున్నారు. గౌతమ్ కంటే
    ప్రిన్స్ క్యూట్‍గా ఉంటాడు అని శోభా శెట్టి అంటే.. నాకు ఫస్ట్ నుంచే గౌతమ్ నచ్చడు…
    ఒరిజినల్‍గా ఉండడు అని నాకు అనిపించేది అని రతిక అంది. రతిక పాప సడెన్ రియలైజేషన్ చూసి ప్రేక్షకులు తీవ్రమైన షాక్ కి గురి అయ్యారు.