Bigg Boss Telugu 7 : మరి కొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కానుంది. ప్రోమోలు కూడా హల్చల్ చేస్తున్నాయి. మరోసారి నాగార్జున హోస్టింగ్ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. నాగార్జునతో కూడిన బిగ్ బాస్ తెలుగు 7 ప్రోమోలు వచ్చేశాయి. దీంతో వరుసగా ఐదో సీజన్ కి నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు అయ్యింది. సీజన్ 1 కి ఎన్టీఆర్, సీజన్ 2కి నాని హోస్టింగ్ చేశారు. సీజన్ 3 నుండి నాగార్జున దున్నేస్తున్నారు. బిగ్ బాస్ 7 ప్రోమోలో నాగార్జున ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. కుడి ఎడమైతే… అన్నారు.
ఈ కుడి ఎడమైతే అంటే అర్థం ఏమిటని అడగ్గా… న్యూస్ రూల్స్, గేమ్స్, టాస్క్స్ ఉంటాయని వెల్లడించారు. బిగ్ బాస్ సీజన్ 6 విఫలం చెందింది. కనీస టీఆర్పీ రాబట్టలేకపోయింది. గత సీజన్ వైఫల్యాలను సీజన్ 7 లో అధిగమించాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలకు మించి ఎంటర్టైన్ చేసి భారీ టీఆర్పీ రాబట్టాలనే యోచనలో ఉన్నారు. ఇందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా క్రేజీ కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపాలని డిసైడ్ అయ్యారు.
ఆల్రెడీ సీజన్ 7 కంటెస్టెంట్స్ లిస్ట్ సిద్ధమైంది. కొందరి పేర్లు బయటకు వచ్చేశాయి. గత సీజన్స్ తో పోల్చుకుంటే గ్లామర్ డోస్ పెంచారనే మాట వినిపిస్తోంది. కంటెస్టెంట్స్ లో మెజారిటీ అమ్మాయిలు ఉండనున్నారట. స్పైసీ కంటెంట్ ఉండేలా చేసుకుంటున్నారట. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం… యూట్యూబర్ శ్వేతా నాయుడు , సింగర్ మోహన భోగరాజు, సింగర్ సాకేత్, బుల్లితెర నటుడు ఈటీవీ ప్రభాకర్, సీరియల్ జంట అమర్ దీప్-తేజస్విని, కుర్తీకదీపం ఫేమ్ శోభా శెట్టి, సురేఖా వాణి, జర్నలిస్ట్ సురేష్, టిక్ టాక్ దుర్గారావు దంపతులు కంటెస్టెంట్స్ గా ఎంపికయ్యారని అంటున్నారు.
ఈ లిస్ట్ లో చాలా మంది ఉండొచ్చు. కాగా బిగ్ బాస్ షోకి కూడా సెన్సార్ ఉండాలని ఇటీవల హైకోర్ట్ అభిప్రాయపడింది. ఈ మేరకు బిగ్ బాస్ మేకర్స్ తో పాటు హోస్ట్ నాగార్జునకు నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. కంటెస్టెంట్ హద్దులు దాటి ప్రవర్తించినా అది చూపించకపోవచ్చు. మరి చూడాలి ఈ సీజన్ లో నాగార్జున ఎలాంటి మ్యాజిక్ చేస్తారో…