Bigg Boss Telugu 6: బిగ్ బాస్ షోను రసవత్తరంగా మలిచేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. కామెడీ పండించే పనిలో పడింది. ప్రస్తుత కాలంలో వినోదానికి ప్రధానమైన స్థానం ఇస్తుండటంతో ప్రేక్షకులు కామెడీనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కామెడీ పండించాలని ప్రణాళికలు వేస్తోంది. దీని కోసం పలు మార్గాలు వెతుకుతోంది. బిగ్ బాస్ షోలో కామెడీ తగ్గిందనే వాదనలు వస్తుండటంతో వినోదాన్ని పండించే వారి కోసం చూస్తున్నారు. వినోదం విషయంలో రాజీ పడకుండా ఆర్టిస్టులకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.
యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్ లాంటి వారు కామెడీ చేయలేకపోతున్నారు. దీంతో ప్రేక్షకులు బోరుగా ఫీలవుతున్నారు. కామెడీ చేసి మెప్పించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా పలు షోల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్న వారిని తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ వేరే షో లో చేసే వారు ఇక్కడకు వస్తారో లేదో అనే సందేహంలో ఉన్నారు. వారిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకున్న షోల యాజమాన్యాలు వారిని అంత తేలిగ్గా వదలవు. దీంతో బిగ్ బాస్ యాజమాన్యం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో తెలియడం లేదు. మొత్తానికి అన్ని కార్యక్రమాలు వినోదమే ప్రధానంగా సాగుతున్నాయి.
Also Read: RRR Movie Criticisms: రోత.. క్రియేటివిటీనే ఆర్‌ఆర్‌ఆర్.. గొంతెత్తునున్న సినీ విమర్శకులు!
ఇటీవల కాలంలో జబర్దస్త్ మంచి ఫామ్ షోగా గుర్తింపు పొందుతోంది. వినోదాన్ని పంచే కార్యక్రమంగా ముందు వరుసలో ఉంది. దీంతో అందులోని ఆర్టిస్టులను తీసుకోవాలని బిగ్ బాస్ భావిస్తున్నా అది సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. ఇదివరకే జబర్దస్త్ నుంచి ముక్కు అవినాశ్ బిగ్ బాస్ షోకు వచ్చినా తరువాత అతడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ ఫేం ఆర్టిస్టులు ఇందులోకి రావడం గగనమే. కానీ కామెడీ చేసే వారి కోసం ఎర్ర తివాచీలు పరుస్తున్నట్లు సమాచారం.
బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కామెడీనే ప్రధానంగా చేసుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం కంటెస్టెంట్లను కూడా ఖరారు చేస్తున్నారు. కామెడీ విషయంలో తగ్గేదేలే అని చెబుతున్నారు. ప్రేక్షకుల సంతోషమే ప్రధానంగా షో ముందుకు సాగనుంది. దీని కోసం నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షోను మరింత రసవత్తరంగా సాగేలా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బబర్దస్త్ లో మంచి పేరు సంపాదించుకున్న రచ్చ రవిని బిగ్ బాస్ షోకు తీసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే రచ్చ రవి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో అతడితో పాటు మరికొందరిని కూడా తీసుకుని కామెడీని పండించాలని ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. బిగ్ బాస్ షో కూడా కామెడీని ప్రధానంగా చేసుకుని తమ మనుగడ సాగించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
Also Read:Esther Anil : ‘దృశ్యం’ సినిమాలోని ఆ పాప అందాలు చూడతరమా?
Recommended videos