Bigg Boss 6 Telugu- Prize Money Nominations Task: బిగ్ బాస్ గత సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ ప్రారంభం చాలా స్లో గా ఉండడం తో టీఆర్ఫీ రేటింగ్స్ భారీగా తగ్గిపోయి నిర్వాహకులకు నష్టాలను మిగిలించాయి..అయితే ఆ తర్వాత చిన్న పుంజుకుంటూ వచ్చి ప్రస్తుతానికి డీసెంట్ స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చే రేంజ్ కి ఎదిగింది..కానీ ఎంత డీసెంట్ రేటింగ్స్ వచ్చిన గత సీజన్స్ తో పోలిస్తే చాలా తక్కువే అని చెప్పాలి.

నష్టాలు రావడం తో బిగ్ బాస్ టీం హైయెస్ట్ పేమెంట్ డిమాండ్ చేసే కంటెస్టెంట్స్ అందరిని వోటింగ్స్ తో సంబంధం లేకుండా ఎలిమినేట్ చేసేసినట్టు సమాచారం..గీతూ , సూర్య మరియు అర్జున్ కళ్యాణ్ వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని అలాగే పంపించారని సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్ల్స్..ఇక గత వీకెండ్ లో నాగార్జున గారు బిగ్ బాస్ ప్రైజ్ విన్నర్ కి 50 లక్షలు వస్తుందని పెద్ద హోర్డింగ్ తో హౌస్ మేట్స్ లో మిగులున్న టాప్ 10 కంటెస్టెంట్స్ కి ప్రత్యేకంగా తెలిపాడు.
ఇది అందరికి తెలిసిందే కదా..మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం ఎందుకని అందరికి అనిపించింది..కానీ ఈ వారం బిగ్ బాస్ ఈ ప్రైజ్ మనీ కి ఎసరు పెడతాడని మాత్రం ఎవ్వరు ఊహించలేకపోయారు..టాస్కులు ఆధారణం గా ఇంటి సభ్యులతో ప్రైజ్ మనీ నుండి ఖర్చు చేయిస్తున్నాడు..నిన్న నామినేషన్స్ నుండి సేఫ్ అవ్వడానికి దాదాపుగా 5 లక్షల రూపాయిలు రాజ్ చేత ఖర్చు చేయించిన బిగ్ బాస్, ఆ తర్వాత ప్రైజ్ మనీ ని 45 లక్షలకు కుదించాడు..పోనీ ఇక్కడితో అయిన ఆపినాడా అంటే అది కూడా లేదు.

కెప్టెన్సీ టాస్కు కంటెండర్లు అవ్వడం కోసం మరో మూడు లక్షలు ఖర్చు చేయించాడు..అలా బిగ్ బాస్ కాష్ ప్రైజ్ అమౌంట్ 45 లక్షల నుండి 42 లక్షలకు పడుతుంది..చివరి వారం వరుకు ఇలాగె టాస్కుకీ ఇష్టమొచ్చినట్టు తగ్గించుకుంటూ పోతే చివరికి బిగ్ బాస్ కాష్ ప్రైజ్ ఎక్కడ పది లక్షల రూపాయిలు అవుతుందోనని ఇంటి సభ్యులు భయపడుతున్నారు..మరి బిగ్ బాస్ గేమ్ ప్లాన్ రాబొయ్యే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.