https://oktelugu.com/

Bigg Boss Telugu 5: మొత్తం 19మందిలో బిగ్ బాస్ విజేత అయ్యే చాన్స్ ఆ ఒక్కడికే..

Bigg Boss Telugu 5: Out of 19 people, he is the only one who has a chance to win Bigg Boss : బిగ్ బాస్ సీజన్ 5 రియాలిటీ షో నిన్న గ్రాండ్ గా ప్రారంభమైంది.. ఈసారి హౌస్ లోకి కొన్ని కొత్త ముఖాలు వచ్చాయి. వర్ధమాన యూట్యూబర్స్, టీవీ, సినీ నటులకు అవకాశం ఇచ్చారు. ఉన్న వారిలో కొందరైతే అస్సలు వారి గురించి ప్రేక్షకులకు పరిచయం తక్కువనే.. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 6, 2021 / 08:53 AM IST
    Follow us on

    Bigg Boss Telugu 5: Out of 19 people, he is the only one who has a chance to win Bigg Boss : బిగ్ బాస్ సీజన్ 5 రియాలిటీ షో నిన్న గ్రాండ్ గా ప్రారంభమైంది.. ఈసారి హౌస్ లోకి కొన్ని కొత్త ముఖాలు వచ్చాయి. వర్ధమాన యూట్యూబర్స్, టీవీ, సినీ నటులకు అవకాశం ఇచ్చారు. ఉన్న వారిలో కొందరైతే అస్సలు వారి గురించి ప్రేక్షకులకు పరిచయం తక్కువనే..

    ఓవరాల్ గా చూస్తే నటి లహరి, నటి హమీదా, మోడల్ జెస్సీ లాంటి ఎక్కువగా జనాలకు తెలియదు.. కొత్త వారి గురించి సోషల్ మీడియాలో తెగ ఆరా తీస్తున్నారు. ఇప్పుడున్న19మంది కంటెస్టెంట్లను గమనిస్తే అందులో బిగ్ బాస్ సీజన్ 5 గెలిచే సత్తా అందరికీ సుపరిచితమైన యాంకర్ రవికి మాత్రమే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో అందరిలోకి అంతో ఇంతో ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ తెలిసిన ముఖం అతడే. సో అప్పుడే యాంకర్ రవినే విజేత అన్న టాక్ నడుస్తోంది.

    ఇక యాంకర్ రవి తర్వాత ఆనీ మాస్టర్, లోబో, షణ్ముఖ్ లాంటి వాళ్లకు అంతో ఇంతో పేరుంది. అందరిలోకి మెరుగ్గా.. చురుగ్గా యాంకర్ రవియే కనపడుతున్నారు. బుల్లితెరపై ఫేమస్ యాంకర్ కావడంతోపాటు సినీ ఇండస్ట్రీతో హీరోలతోనూ సంబంధాలున్నాయి.దీంతో రవికి మద్దతుగా వారంతా క్యాంపెయిన్ చేయడం ఖాయం. వారే విజేతలుగా నిలవడం పక్కా అంటున్నాు.

    తెలుగు ప్రేక్షకులకు యాంకర్ రవి గురించి బాగా తెలుసు. లాస్యతో కలిసి మొదట్లో ఇతడు చేసిన లవ్ ట్రాక్, కామెడీకి అందరూ ఫిదా అయ్యారు. పెళ్లిని దాచేసి భార్య పిల్లలను చూపించని రవి.. ఈ మధ్యే వారిని తెరపైకి తీసుకొచ్చాడు. ఆ తప్పును తాజాగా బిగ్ బాస్ వేదికపై ఒప్పుకున్నాడు.

    ఇక క్వారంటైన్ లో ఉన్న సమయంలోనే యాంకర్ రవి ఒక వీడియోను రికార్డు చేశాడు. తాజాగా దాన్ని విడుదల చేశారు. ‘తప్పు చేస్తే ట్రోల్ చేయండి.. కానీ అందులోకి ఫ్యామిలీ మెంబర్స్ ను తీసుకురాకండి’ అని వేడుకున్నాడు. ‘ప్రతీ సీజన్ కు తనను పిలిచారని.. కానీ వేరే కమిట్ మెంట్స్ వల్ల రాలేకపోయాను.. ఈ సీజన్ కు రావడానికి కారణాలున్నాయి.. యాంకర్ రవి ఇలాంటోడు అని వేలెత్తి చూపించన వారికి నేను ఏంటో చూపించడానికి వచ్చానని.. ‘రవికిరణ్ రాట్లేను చూపిస్తానని’ తన అసలు పేరును బయటపెట్టాడు యాంకర్ రవి.