Priya: బిగ్ బాస్ సన్ ఫన్ డే ముగించుకుని ఏడో వారం ఎలిమినేషన్ ప్రక్రియని కూడా పూర్తి చేసుకుంది. ఆదివారం నాడు కంటెస్టెంట్స్ తో ఫన్నీ గేమ్స్ ఆడుతూ అలరించాడు నాగ్. దాని తర్వాత డేంజర్ జోన్ ఉన్న ఇద్దరితో పాటు మిగతా కంటెస్టెంట్స్ ని కూడా కాసేపు టెన్షన్ కి గురి చేశాడు నాగార్జున. అయితే ఎప్పటి నుండో వినిపిస్తున్నట్లు గానే బిగ్ బాస్ నుండి ప్రియా ఏడో వారానికి గాను ఎలిమినేట్ అయ్యింది. అయితే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ప్రియా ఇంకా తట్టాబుట్టా సర్దుకుని బిగ్ బాస్ హౌస్ నుండి స్టేజి పైకి వచ్చింది.

అయితే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కి బిగ్ బాస్ హౌస్ లో జరిగిన జర్నీని చూపించి భావోద్వాగాలకి గురయ్యేలా చేస్తాడు నాగార్జున. ఆ తర్వాత ఒక గేమ్ ఆడిస్తాడు. అలా ఇంట్లో ఉన్న సభ్యునికి రిపోర్ట్ కార్డు ఇవ్వాలని ప్రియా కి సూచించాడు నాగార్జున. అందరికీ మార్కులిస్తూ ఒక్కొక్కరి గురించి చెప్పమంటాడు నాగార్జున. అలా ప్రతి ఒక్క సభ్యుని గురించి చెప్తూ మార్కులు ఇచ్చింది ప్రియా. ముందుగా లోబో గురించి మాట్లాడుతూ … తనకి అర్ధం కాలేదు అని చెప్తూ ఐదు మార్కులు ఇచ్చింది. ఎవరిని హర్ట్ చేయకుండా నువ్వు హర్ట్ కాకుండా గేమ్ ఆడాలి అంటూ లోబో కు సూచించింది. ఇంకా శ్రీరామ చంద్ర తనకి కనెక్ట్ అవ్వలేదు అంటూ ఎనిమిది మార్కులు వేసింది. అంతే కాకుండా తనకు బయటకు వచ్చాక పాటలు కూడా నేర్పించాలని చెప్పింది.
ఇక హౌస్ లో తనకి ఎంతో ఇష్టమైన పింకీ గురించి ఎంతో అద్భుతం గా చెప్పింది ప్రియా. పొద్దున్నే లేవగానే పింకీ ముఖం చూస్తూ రోజు ని ప్రారంభించేదాన్ని అని చెప్పగానే బోరున విలపించింది పింకీ. అంతే కాకుండా వంద మార్కులు ఇచ్చి ఇది చాలా తక్కువ అని చెప్పి పింకీ మీద ఉన్న తన ఇష్టాన్ని బయట పెట్టింది ప్రియా. ఇంకా మానస్ గురించి మాట్లాడుతూ …. తను చాలా మంచివాడు, నా బంగారు కొండ అంటూ పొగడ్తలతో ముంచెత్తింది ప్రియా. ఇంకా మానస్ కి ప్రియా పది మార్కులు ఇచ్చింది. తన ప్లేట్ తినే హక్కు, తన కప్ లో కాఫీ తాగే అధికారం ఒక్క సన్నీ కే ఉందంటూ తొమ్మిది మార్కులు ఇచ్చింది ప్రియా.
ఇంకా యూట్యూబ్ సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ గురించి మాట్లాడుతూ… తాను మంచి స్నేహితుడని, తన లాంటి వాడు అందరికీ ఉండాలని చెప్పుకొచ్చింది. సరే నేను బయటకు వెళ్తున్నాను కదా.. దీప్తి కి ఏమైనా చెప్పమంటావా అంటూ ఆటపట్టించింది ప్రియా. ఈ మాత్రం అడిగారు అంటూ చేతులెత్తి దండం పెట్టాడు ప్రియా కి షన్ను. ఇంట్లో అమ్మ – నాన్న కి భయపడను ఆ అమ్మాయికి తప్ప అంటూ తన గర్ల్ ఫ్రెండ్ అయిన దీప్తి గురించి చెప్పుకొచ్చాడు షణ్ముఖ్.