Bigg Boss 7 – Sharmila : తెలుగు, తమిళ భాషల్లో బిగ్ బాస్ షో ఒకే ఏడాది మొదలైంది. ఫస్ట్ సీజన్ నుండి కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు నుండి బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7 ప్రారంభం కానుంది. కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి కాగా కామనర్ కోటాలో షర్మిల ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. ఇంతకి ఎవరీ షర్మిల అంటే… ఈమె సోషల్ మీడియా సెలబ్రిటీ. కొన్ని కొన్ని వృత్తుల్లో ఆడవాళ్లను ప్రత్యేకంగా చూస్తారు. అంటే మగాళ్లు చేసే పని ఆడవాళ్లు చేయడం వింతగా ఉంటుంది. లేడీ బస్ డ్రైవర్ గా షర్మిల తమిళనాడులో బాగా పాపులర్ అయ్యారు.

ఈ యంగ్ లేడీ తన డ్రైవింగ్ వీడియోలతో ఫ్యాన్స్ ని సంపాదించారు. ఈ క్రమంలో ఆమె బస్సులో సాధారణ ప్రయాణికులతో పాటు ఎంపీ కనిమొళి ప్రయాణం చేశారు. అయితే అక్కడే చిన్న వివాదానికి దారి తీసింది. అదే బస్సుల్లో కండక్టర్ గా ఉన్న మహిళ.. ఏకంగా తన బస్సు ఎక్కిన ఎంపీ కనిమొళి అనుచరుల పట్ల దురుసుగా ప్రవర్తించింది. దాంతో కనిమొళి అలిగి బస్సు దిగిపోయారు. తన కోసం వచ్చిన ఎంపీని అవమానించిన కారణంగా షర్మిల కూడా బాగా హర్ట్ అయ్యి కండక్టర్ వ్యవహరించిన తీరు నచ్చక బస్సు నెక్స్ట్ స్టాప్ లో ఆపి వెళ్ళిపోయింది.
తర్వాత యాజమాన్యం షర్మిలను ఉద్యోగం నుండి తీసేశారు. పని మీద కంటే ఆమెకు పబ్లిసిటీ మీద దృష్టి ఎక్కువైందని యాజమాన్యం ఆరోపించింది.. షర్మిల ఉద్యోగం కోల్పోయిన విషయం తెలుసుకున్న కమల్ హాసన్ ఆమెకు కారు బహుమతిగా ఇచ్చాడు. టాక్సీ డ్రైవర్ గా జీవనోపాధి కలిగించారు. ఆమె మరికొంత మందికి ఉపాధి ఇచ్చే స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. దాంతో షర్మిల మరింత ఫేమస్ అయ్యారు.
కాగా ఈ లేడీ డ్రైవర్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టనుందట. కామనర్ కోటాలో ఆమెను ఎంపిక చేశారని తెలుస్తుంది. వచ్చే నెలలో బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7 గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఇక కమల్ హాసన్ హోస్ట్ గా ఉన్నారు. షర్మిల హౌస్లో సంచలనాలు చేయడం ఖాయం అంటున్నారు. ఆమె కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ ఇచ్చే సూచనలు కలవు.