
మహమ్మారి కరోనా బుల్లితెర నటులను వెంటాడుతోంది. ఇప్పటికే పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. తాజాగా మరో ఇద్దరు సీరియల్ నటులకు కూడా ఈ మహమ్మారి సోకినట్టు తేలింది. అందులో ఒకరు బిగ్‌బాస్ 3 ఫేమ్ రవికృష్ణ కావడం గమనార్హం. టీవీ నటుడు సాక్షి శివకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్3తో పాపులర్ అయిన రవికృష్ణ స్వయంగా వెల్లడించాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా తనకి కరోనా సోకిందని తెలిపాడు. అయినా తనకు ఎలాంటి లక్షణాలు లేవన్నాడు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని స్పష్టం చేశాడు. అయితే, తనతో కలిసి పని చేసిన వారిని జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థించాడు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించి ఐసోలేషన్‌లో ఉంచాలని ఆయా సీరియల్ బృందాలను కోరాడు.
జగన్ ను విమర్శించాలన్న.. పొగాడాలన్న.. అతడేనా?
మరోవైపు అక్క మొగుడు, నెంబర్ 1 కోడలు, మౌనరాగం వంటి సీరియల్స్‌లో నటిస్తున్న శివకు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో టీవీ పరిశ్రమ ఉలిక్కిపడింది. ఆమె కథ సీరియల్ నటి నవ్య స్వామి సహా ఇది వరకే పలువురు ఆర్టిస్టులు కరోనా బారిన పడ్డారు. ప్రభుత్వం షూటింగ్స్‌కు అనుమతి ఇచ్చిన తర్వాత పలు జాగ్రత్తలు తీసుకొని చిత్రీకరణలు జరుపుతున్నారు. అయినా ఇలా వరుసగా కరోనా కేసులు నమోదవుతుండడంతో సీరియల్ దర్శక, నిర్మాతలు తల పట్టుకుంటారు. ఈ పరిస్థితుల్లో షూటింగ్స్ కొనసాగించాలా? వద్దా? అని సతమతమవుతున్నారు. అదే సమయంలో ఆర్టిస్టులు కూడా అయోమయంలో పడ్డారు. షూటింగ్స్ లేకపోతే బతుకు బండి నడవడం కష్టం. వస్తే బ్రతుకుతామో లేదో తెలియని పరిస్థితి వారిని ఆలోచింపజేస్తోంది. ఇప్పటికే కొన్ని సీరియల్స్ షూటింగ్స్‌ను రద్దవగా.. తాజా పరిణామాల నేపథ్యంలో మరిన్ని సీరియల్స్ అదే బాటలో ఉన్నాయని తెలుస్తోంది.