Singer Damini Bhatla: బిగ్ బాస్ హౌస్లో సింగర్ దామిని కథ త్వరగా ముగిసింది. ఈమె సీజన్ 7 వంటలక్కగా మారిపోయింది. గేమ్ పర్లేదు, అయినా టఫ్ కాంపిటీషన్ మధ్య ఆమె ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. దామిని హౌస్లో ఎక్స్పోజింగ్ చేయడం విశేషం. దామిని బయటకు కనిపించే సాఫ్ట్ కాదు, ఆమెలో బోల్డ్ యాటిట్యూడ్ ఉందని షో ద్వారా తెలిసింది. ఇక తాజా ఇంటర్వ్యూలో దామిని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక షోలో టెలికాస్ట్ చేసిన సంఘటనలు నన్ను తప్పుగా ప్రొజెక్ట్ చేశాయని దామిని అన్నారు.
టాస్క్ లో భాగంగా ప్రిన్స్ యావర్ ముఖాన పేడ వేశాను. అది చూపించారు కానీ తర్వాత అతనికి నేను సారీ చెప్పడం, స్వయంగా తల స్నానం చేయించడం చూపించలేదు. నేను పూర్తిగా వెజిటేరియన్. అయితే గుడ్డు తింటాను. హౌస్లో మొదటిసారి చికెన్ వండాను, అని దామిని అన్నారు. వ్యక్తిగత జీవితం గురించి దామిని కీలక వ్యాఖ్యలు చేశారు.
నేను ప్రేమ వివాహం చేసుకుంటాను. ముందు సహజీవనం చేసి తర్వాత వివాహం చేసుకోవాలనేది నా కోరిక. ఈ విషయంలో ముందు పేరెంట్స్ ని ఒప్పించి తర్వాత నిర్ణయం తీసుకుంటాను, అన్నారు. నేను బాహుబలి మూవీలో పచ్చబొట్టేసినా సాంగ్ పాడాను. కానీ నా ఒంటిపై ఒక్క టాటూ లేదు. ఏదైనా స్పెషల్ మూమెంట్ లో నాకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి టాటూ వేయించుకుంటాను, అని ఆమె చెప్పుకొచ్చారు.
కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘పచ్చ బొట్టేసినా’ సాంగ్ పాడిన దామిని సింగర్ గా పాప్యులర్ అయ్యింది. అనంతరం పలు చిత్రాలకు పని చేసింది. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ గా ఆమె ఎంపికయ్యారు. 14 మంది కంటెస్టెంట్స్ లో దామిని ఒకరు. దామిని మూడో వారం ఎలిమినేట్ అయ్యింది. ఆమె కంటే ముందు కిరణ్ రాథోడ్, షకీలా ఎలిమినేటైన విషయం తెలిసిందే. ఇక హౌస్ని వీడిన నాలుగో కంటెస్టెంట్ కూడా అమ్మాయే కావడం విశేషం. రతికా రోజ్ ఈ వారం ఎలిమినేట్ అయ్యింది.