Bigg Boss Season 7 Winner : బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ మాటతప్పాడు అనే విమర్శలు వెలువెత్తిన సంగతి తెలిసిందే. తాను టైటిల్ కొడితే ప్రైజ్ మనీ మొత్తం నిరుపేద రైతు కుటుంబాలకు సహాయంగా ఇస్తానని వెల్లడించాడు. అయితే బిగ్ బాస్ టైటిల్ కొట్టిన పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాట ప్రకారం ప్రైజ్ మనీ డొనేట్ చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల పై తాజాగా స్పందించాడు పల్లవి ప్రశాంత్. తాను గెలుచుకున్న డబ్బులు ఏం చేసింది చెప్పుకొచ్చాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7(BIGG BOSS TELUGU SEASON 7)లో పల్లవి ప్రశాంత్(PALLAVI PRASHANTH) ఒక సంచలనం. బడా బడా సెలెబ్స్ ని వెనక్కి నెట్టి టైటిల్ ఎగరేసుకుపోయాడు. రైతుబిడ్డ ట్యాగ్ తో షోలోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ కి ఎలాంటి ఇమేజ్ లేదు. సోషల్ మీడియాలో కూడా చెప్పుకోదగ్గ పాపులారిటీ లేదు. ఒక విధంగా చెప్పాలంటే సామాన్యుడు అనొచ్చు. పల్లెటూరి వాతావరణంతో పుట్టి పెరిగి, వ్యవసాయం చేసుకునే పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. ఫిజికల్ టాస్క్ లలో పల్లవి ప్రశాంత్ సత్తా చాటాడు. తన మాట తీరుతో పాటు రైతుబిడ్డ అనే ట్యాగ్ కలిసొచ్చాయి.
Also Read : రీమేక్ పై అక్కినేని నాగార్జున మొగ్గు..100వ సినిమా గురించి సెన్సేషనల్ న్యూస్!
వెరసి పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. ఒక రైతుబిడ్డగా తాను టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీ మొత్తం పేద రైతు కుటుంబాలకు పంచుతానని పల్లవి ప్రశాంత్ వాగ్దానం చేశాడు. ఈ కామెంట్ సైతం అతడు విన్నర్ కావడానికి కారణమైంది. టైటిల్ గెలిచాక పల్లవి ప్రశాంత్ ని వరుస వివాదాలు చుట్టుముట్టాయి. పోలీసుల మాట ఖాతరు చేయకుండా రోడ్ షో నిర్వహించి అరెస్ట్ అయ్యాడు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యాడు. పూర్తిగా తన వేషం మార్చేసి, విందులు, వినోదాల్లో తేలియాడుతున్న పల్లవి ప్రశాంత్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇవన్నీ పక్కన పెడితే… పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాట ప్రకారం ప్రైజ్ మనీ రైతులకు దానం చేయలేదనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబానికి పల్లవి ప్రశాంత్ రూ. 1 లక్ష సహాయం చేశాడు. అలాగే ఏడాదికి సరిపడా బియ్యం కూడా ఆ కుటుంబానికి ఇచ్చాడు. తోటి కంటెస్టెంట్ శివాజీతో పాటు ఆ రైతు కుటుంబాన్ని కలిసి సహాయం అందించాడు. అనంతరం మరొకరికి సహాయం చేసిన దాఖలాలు లేవు. నెలలు గడుస్తున్నా పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీ పంచాడన్న సమాచారం లేకపోవడంతో, చేతులు ఎత్తేశాడని కథనాలు వెలువడ్డాయి.
తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న పల్లవి ప్రశాంత్.. ఇచ్చిన మాట ప్రకారం తాను పలువురికి సహాయం చేస్తున్నట్లు వెల్లడించాడు. అయితే కొందరు పేర్లు చెప్పలేను. ఒకరి పెర్సనల్ లైఫ్ ని మనం బయటపెట్టకూడదు. సహాయం పొందినవారు బయటకు వచ్చి చెప్పేందుకు ఇష్టపడటం లేదు. ఓ అమ్మాయి డిగ్రీలో ఫస్ట్ వచ్చానని చెప్పడంతో సంతోషించాను. ఆమెకు తాను చేసిన సహాయం గురించి బయటకు చెప్పేందుకు ఇష్టపడలేదు. ప్రైజ్ మనీ మాత్రమే కాదు. జీవితాంతం నేను సంపాదించిన దాంతో కొంత పేదలకు సహాయం చేస్తాను. బిగ్ బాస్ ప్రైజ్ మనీలో భారీగా కోత విధించారు. కారు, నెక్లెస్ కి కూడా కొంత డబ్బులు చెల్లించాల్సి వచ్చింది.. అని అన్నాడు.