Shiva Jyoti : తీన్మార్ వార్తల ద్వారా సావిత్రి అలియాస్ శివ జ్యోతి పిచ్చ పాప్యులర్. తెలంగాణ యాక్సెంట్ లో ఈమె చదివే వార్తలు భలే ఉండేవి. ఆమె సోషల్ సెటైర్స్ బాగా పేలేవి. బిత్తిరి సత్తితో కలిసి తీన్మార్ సావిత్రి బుల్లితెర మీద పెద్ద సంచలనమే చేసింది. వీరి కాంబో సూపర్ హిట్ అనాలి. అలా వచ్చిన ఫేమ్ ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ తెచ్చిపెట్టింది.శివ జ్యోతి బాగానే రాణించింది. చాలా వారాలు హౌస్ లో ఉంది. జస్ట్ ఫినాలే కి ముందు ఎలిమినేట్ అయ్యింది. ఆ సీజన్ విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. యాంకర్ శ్రీముఖి రన్నర్ అయ్యింది.
టైటిల్ గెలవకపోయినా శివ జ్యోతి అభిమానులను అలరించింది. తన శాయిశక్తులా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆమెకు సోషల్ మీడియా లో పాపులారిటీ రావడంతో యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ లో తరచుగా వీడియోలు చేస్తుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. భర్త ఆల్కహాలిక్ హ్యాబిట్ ని ఆమె ఎక్స్ పోజ్ చేసింది. విషయంలోకి వెళితే… శివ జ్యోతి భర్త ఆమె పట్ల ఓ విషయంలో అసహనంగా ఉన్నాడు.
శివ జ్యోతి వేలకు వేలు కాస్మొటిక్స్ కోసం ఖర్చు చేస్తుందట. తన బ్యూటీ సామగ్రి కోసమే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతున్నాయట. ఈ విషయాన్ని శివ జ్యోతి భర్త గంగూలీ వీడియోలో తెలియజేశాడు. అయితే నేను చేసిన ఖర్చు చాలా తక్కువే నీ ఖర్చు చూపిస్తానని శివ జ్యోతి ఓపెన్ అయ్యింది. శివ జ్యోతి ఇంట్లో ఖరీదైన ఫారిన్ మందు బాటిళ్లు ఉన్నాయి. ఒక్కో బాటిల్ ధర ఆరాడు వేలు ఉంది. దాంతో రోజు శివ జ్యోతి భర్త మందు తాగుతాడని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా బుల్లితెర సెలెబ్స్ ప్రతి ఒక్కరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు. డబ్బుల కోసం ఎలాంటి వీడియోలు అయినా చేస్తున్నారు. వ్యూస్ రావాలంటే కాంట్రవర్సీ, బోల్డ్ కంటెంట్ కావాలి. దానికోసం వారి తపన. ఇలాంటి విదేవులపై కొందరు నెటిజెన్స్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్, డబ్బుల కోసం ఇలాంటి దిగజారుడు పనులు అవసరమా అంటున్నారు. శోభా శెట్టి, ప్రియాంక సింగ్, ప్రియాంక జైన్ వంటి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ఇలాంటి సిల్లీ వీడియోలు చేస్తున్నారు.