Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Priyanka Jain: ఇంజక్షన్స్, పిల్స్ వాడాను... సంచలన విషయాలు బయటపెట్టిన బిగ్ బాస్...

Bigg Boss Priyanka Jain: ఇంజక్షన్స్, పిల్స్ వాడాను… సంచలన విషయాలు బయటపెట్టిన బిగ్ బాస్ ప్రియాంక!

Bigg Boss Priyanka Jain: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ శివాజీ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక బిగ్ బాస్ హౌస్ లో జరిగిన కీలక పరిణామాలు తెలియజేసింది. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ .. నేను బయట ఎలా ఉన్నానో లోపల కూడా అలానే ఉన్నాను. అందరికంటే కూడా వెయ్యి శాతం ఎఫర్ట్ పెట్టాను. అలాంటప్పుడు నేనే విన్నర్ అవ్వాలి. కానీ ఎడిటింగ్ లో నేను కొన్ని విషయాల్లో తప్పు చేసినట్లుగా చూపించారు. ఎందుకు చేశారో అర్థం కాలేదు.

హౌస్ లో కొంత మంది స్ట్రాటజీ ప్లే చేస్తూ గేమ్ ఆడారు. వాళ్ళలా నేను కూడా చేసుంటే టాప్ లో ఉండేదాన్ని. శివాజీ గారు నాపై నింద వేశారు. నేను అబద్దాలు ఆడతాను అని అన్నారు. నేను అక్కడే అడిగాను .. అలా అనడం కరెక్ట్ కాదు సార్ అని. కానీ ఆయన నువ్వు అబద్దాలు ఆడతావ్ అనేవారు. చేయని పనిని చేశాను అంటే ఎలా ఒప్పుకుంటాను. అందుకే నిలదీసాను .. గట్టిగా అడిగాను. తర్వాత శివాజీ గారికి దగ్గర అవ్వాలని చాలా ట్రై చేశా .. కావాలనే నన్ను దూరం పెట్టారు.

ఆయన కచ్చితంగా మాస్క్ తో ఉన్నారు. జెన్యూన్ గా మాత్రం లేరు. ఆయన మాస్టర్ మైండ్ తో ఆలోచించేవారు. శివాజీ గారి ఒరిజినాలిటీ ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. కానీ నాకు హౌస్ లో ఉన్నప్పుడే ఆయనేంటో అర్ధం అయింది. బిగ్ బాస్ హౌస్ లో కొంతమందిని చూశాక 100 రోజులు ఏంటి .. జీవితాంతం నటించవచ్చు అని తెలిసింది. నాకు ఆరోగ్యం బాగోక ఇంజక్షన్స్, పిల్స్ వాడాను అవేమీ షోలో చూపించలేదు. అంటూ ప్రియాంక సంచలన కామెంట్స్ చేసింది.

ప్రస్తుతం ప్రియాంక సీరియల్స్ చేయడం లేదు. తన తల్లికి అనారోగ్య సమస్యలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తల్లిని చూసుకుంటూ యాక్టింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ప్రియుడు శివ్ కుమార్ తో కలిసి వీడియోలు చేస్తూ సందడి చేస్తుంది. ఎక్కువగా అతనితోనే ఉంటూ ఆమెకు సంబంధించిన అన్ని విషయాలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది ప్రియాంక జైన్.

RELATED ARTICLES

Most Popular