https://oktelugu.com/

Priyanka Jain: పబ్లిక్ లో ప్రియుడితో గొడవపడ్డ బిగ్ బాస్ ప్రియాంక… అందరూ చూస్తుండగానే!

అనూహ్యంగా లవ్ బర్డ్స్ ప్రియాంక - శివ్ కుమార్ మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. పబ్లిక్ ప్లేస్ లో గొడవ పడుతూ కొట్టుకునే వరకు వెళ్లారు. ప్రియాంక ఫైర్ అవుతూ ప్రియుడి పై చేయి చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే .

Written By:
  • S Reddy
  • , Updated On : February 18, 2024 / 09:18 AM IST
    Follow us on

    Priyanka Jain: బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ యాక్టింగ్ నుండి చిన్న బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఐతే సోషల్ మీడియాలో నిత్యం సందడి చేస్తుంది. ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ క్రేజ్ పెంచుకుంటుంది. ఈ విరామ సమయంలో ప్రియుడితో గడుపుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఎక్కడికి వెళ్లినా శివ్ కుమార్ ని వెంటబెట్టుకుని వెళుతుంది. వారి రొమాంటిక్ వీడియోలు ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. కాగా వీరు చాలా కాలంగా ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. అతి త్వరలో పెళ్లి కూడా చేసుకుంటామని ఈ జంట ప్రకటించారు.

    అనూహ్యంగా లవ్ బర్డ్స్ ప్రియాంక – శివ్ కుమార్ మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. పబ్లిక్ ప్లేస్ లో గొడవ పడుతూ కొట్టుకునే వరకు వెళ్లారు. ప్రియాంక ఫైర్ అవుతూ ప్రియుడి పై చేయి చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే .. ప్రియాంక – శివ్ కుమార్ చీరలు కొనడం కోసం ఓ షాపింగ్ మాల్ కి వెళ్లారు. వాళ్లకు అక్కడున్న స్టాఫ్ శారీ కలెక్షన్ వరుసగా చూపిస్తున్నారు. ఇంతలో శివ్ కుమార్ మంచి చీరలు సెలెక్ట్ చెయ్… నా గర్ల్ ఫ్రెండ్ కోసం అని ప్రియాంకతో చెప్పాడు.

    దీంతో ప్రియాంక షాక్ అయింది. గర్ల్ ఫ్రెండ్ ఏంటి అని అడిగింది. నాకు యూ ఎస్ లో గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమె కోసమే వెళ్తున్నా, అక్కడే సెటిల్ అయిపోతా అంటూ జోక్ చేశాడు. కానీ ప్రియాంక మాత్రం చాలా సీరియస్ అయింది. ఏం మాట్లాడుతున్నావ్ .. అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. జస్ట్ జోక్ చేశాను అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా కూడా వినకుండా అతని పై ప్రియాంక చేయి చేసుకుంది. యూఎస్ లో నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది.

    తనకు పెళ్లి ఫిక్స్ అయింది. అందుకే వెళ్తున్నాను. గిఫ్ట్ గా మంచి చీరలు తీసుకెళ్దాం అని నిన్ను సెలెక్ట్ చేయమన్నాను అని శివ్ వివరించాడు. దాంతో ప్రియాంక మనసు కుదుట పడింది. అలా పబ్లిక్ ప్లేస్ లో గొడవ పడుతూ రచ్చ చేశారు. కానీ ఇదంతా కేవలం ప్రాంక్. గతంలో కూడా టేస్టీ తేజకు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు ప్రాంక్ చేశారు. యూట్యూబ్ వ్యూస్ కోసం ప్రియాంక జైన్ ఇలాంటి ఫ్రాంక్స్ చేస్తుంది. అయితే ఈ ఫేక్ వీడియోల మీద కొందరు మండిపడుతున్నారు.