Bigg Boss Nonstop Telugu: బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ గా ఎంటర్ టైన్ మెంట్ చేస్తూనే ఉంది. మొదటి వారం అట్టహాసంగా సాగిన ఈ షో.. రెండో వారం కూడా గొడవలు, తిట్టుకోవడాలు, ఒకరి మీద మరొకరు చాడీలు చెప్పుకోవడాలతో నాన్ స్టాప్ బోల్డ్ ఎంటర్ టైన్ మెంట్ కూడా పండిస్తోంది. ఇక అషురెడ్డి, అరియానా లాంటి వారు పెండ్లాం, మరదలు అంటూ ఘాటు ప్రేమను వలకబోస్తున్నారు. అయితే రెండో వారం నామినేషన్స్ అయిన వారికి ఓ వైపు ఓటింగ్ బాగానే జరుగుతోంది.

కాగా మొదటి వారం కంటే రెండో వారం చాలా భిన్నమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ వారం నామినేట్ అయిన వారిలో చాలామంది రెండో వారం కూడా నామినేట్ అయ్యారు. కాగా మొదటి వారం ఓటింగ్ లో టాప్ లో ఉన్న వారు.. సెకండ్ వారం మాత్రం లాస్ట్‌కు పడిపోయారు. ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాగా ఎవరికి ఎలాంటి ఓటింగ్ జరుగుతోందో చూద్దాం ఇప్పుడు.
Also Read: అఖండ కృతజ్ఞత సభ.. బాలయ్య ఫ్యాన్స్ కి పండగే
అందరిలో అఖిల్ సద్దాఖ్ 22శాతంతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. 14శాతంతో అరియానా గ్లోరీ రెండో స్థానంలో ఉంటే.. 10శాతంతో సరయు మూడో స్థానంలో ఉంది. ఇక యాంకర్ శివ 7శాతంతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత హమీదా, అషు రెడ్డి కూడా 7శాతం ఓటింగ్ తో ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు.

అయితే పోయిన వారం ఓటింగ్ లో అందరికంటే చివరి స్థానంలో కొనసాగిన మిత్రా శర్మ ఈసారి మెరుగైన స్థానంలో ఉన్నారనే చెప్పాలి. 6శాతం ఓటింగ్ తో మిత్రా శర్మ ఉండగా, అనిల్ రాథోడ్, నటరాజ్ మాస్టర్ లు ఆ తర్వాత స్థానాలో 6శాతం ఓటింగ్ తోనే కొనసాగుతున్నారు. ఇక చివరగా మహేశ్ విట్టా 4.83 శాతంతో ఉంటే.. శ్రీ రాపాక 4.26శాతంతో చిట్ట చివరి స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు శ్రీ రాపాకకు రామ్ గోపాల్ వర్మ సపోర్టు కూడా ఉంది. ఆమెకు ఓట్ చేయాలంటూ కోరుతున్నాడు ఆర్జీవీ. ఎలాగూ శనివారం వరకు టైమ్ ఉంది కాబట్టి.. ఈ లోగా ఈ ఫలితాలు కొంచెం అటు ఇటు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ చూస్తుంటే చివరి నాలుగు స్థానాలలో ఉన్న వారిలో ఎవరో ఒకరి వికెట్ ఎగిరిపోవడం ఖాయం అనే తెలుస్తోంది.
Also Read: ఆర్ఆర్ఆర్’ అలా చూస్తే కిక్కు ఏముంటుంది.. ఇలా చూడండి