Bigg Boss Non Stop Telugu: తెలుగు నాట బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ ను ఓటీటీలో బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో డిస్నీ హాట్ స్టార్ ప్రసారం చేస్తుండటం తెలిసిందే. శనివారం బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున అట్టహాసంగా బిగ్ బాస్ నాన్ స్టాప్ ను ప్రారంభించగా.. శనివారం నుండి బుధవారం వరకు కాస్త చప్పగా సాగిన షో గురువారం నుండి కాస్త రంజుగా ఉండనుంది. తాజాగా విడుదల చేసిన ఎపిసోడ్ ప్రోమో అంచనాలను పెంచుతోంది. వివాదాలు లేదంటే లవ్ ట్రాక్ లతో జనాల్లో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ లో అప్పుడే వివాదాలు మొదలయ్యాయి.

ఎపిసోడ్ ప్రోమోలో వారియర్స్ టీం వాళ్లు ఇంతకు ముందు హౌస్‌లో ఉన్నప్పుడు చేసిన పొరపాట్లు వాటి నుంచి నేర్చుకున్న గుణపాఠాలను చెప్పాలని, ఛాలెంటర్స్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పాడు. దీంతో పలువురు సీనియర్, మాజీ బిగ్ బాస్ ప్లేయర్లు కొన్ని విషయాలను ముచ్చటించారు. అందులో భాగంగా అఖిల్ ఇచ్చిన స్టేట్మెంట్ కు యాంకర్ శివ షాకింగ్ కామెంట్ చేయడం కనిపించింది.
Also Read: సాహో’ ఫలితం పై ప్రభాస్ కామెంట్స్ వైరల్
గత సీజన్ లో తను బిగ్ బాస్ విన్నర్ టైటిల్ రేసులో ఒక స్టెప్ తాను బ్యాక్ వేసింది తన స్మైల్ మిస్ కావడం వల్ల అని చెప్పుకొచ్చాడు. దీనిపై వెంటనే రియాక్ట్ అయిన యాంకర్ శివ..‘కానీ బయట అనుకున్నది మోనాల్‌తో ఉన్న బాండింగ్’ అంటూ ముక్కుసూటిగా చెప్పేశాడు.

ఇక అరియానా మాత్రం తాను బిగ్ బాస్ లోకి ఇల్లు ఊడ్చిపోదాం అని వచ్చానంటూ సరదాగా మాట్లాడింది.మహేష్ విట్టా మాట్లాడుతూ..‘కొందరు వారు ఒక వారం ఎక్కువగా ఇంట్లో ఉండటానికి ఒకడిని పట్టుకొని ,వాడు ఫ్లో లో ఎదో అంటే దాన్ని బూతద్దం లో చూపించి , వాడి క్యారెక్టర్ బ్యాడ్ చేసి సంక నాకిచ్చి బయటకి పంపుతారు’ అని చెప్పడంతో అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. కాగా కెప్టెన్సీ కోసం వారియర్స్ టీంలోని వారు పోటీపడుతున్నారు. ఈ వారం కెప్టెన్సీ రేసులో అఖిల్, అరియానా, నటరాజ్ మాస్టర్, సరయు, తేజస్వి, మహేష్ లు ఉన్నారు.
Also Read: వివేకా హత్య కేసు: ఏ క్షణమైనా చార్జి షీట్