Sri Satya- Srihan: బిగ్ బాస్ హౌస్లో ప్రేమలు సర్వసాధారణం. ఇది సక్సెస్ ఫార్ములా కూడా. కెమెరాల ముందు లవ్ స్టోరీలు నడపడం, రొమాన్స్ చేయడం అంత ఈజీ కాదు. అయితే రోజుల తరబడి కలిసి ఉండటం ఒకరిపై మరొకరికి ప్రేమలు, అభిమానాలకు కారణం అవుతుంది. హౌస్లో లవర్ బాయ్స్ గా వెలిగిపోయిన రాహుల్ సిప్లిగంజ్, అభిజీత్ లాంటి వాళ్ళు టైటిల్ విన్నర్స్ కూడా అయ్యారు. బిగ్ బాస్ ఇలాంటి స్పైసీ కంటెంట్ కోరుకుంటాడు. ప్రేమికులను ప్రత్యేకంగా కవర్ చేస్తాడు. అయితే ఈ సీజన్లో స్నేహితులు పేరుతో శ్రీహాన్, శ్రీసత్య సన్నిహితంగా ఉంటున్నారు.

హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న 24*7 లైవ్ లో శ్రీహాన్-శ్రీసత్య యవ్వారం క్లియర్ గా కనబడుతుంది. ముఖ్యంగా శ్రీహాన్ వెంట పడుతుంది శ్రీసత్య. అర్జున్ కళ్యాణ్ ఎలిమినేటై వెళ్ళిపోయినప్పటి నుండి వీరిద్దరూ దగ్గరయ్యారు. సిరి నా లవర్ అని శ్రీహాన్ ప్రకటించిన నేపథ్యంలో ఓపెన్ కావడం లేదు. స్నేహితులం అని చెప్పుకుంటూ ప్రేమకథ నడుపుతున్నారు. ఇది ఇంటి సభ్యులకు క్లియర్ గా అర్థమైంది. ఇనయా, రేవంత్ ఒకటి రెండు సందర్భాల్లో దీని గురించి మాట్లాడారు కూడా.
ఎప్పుడూ కలిసి ఉంటూ హగ్గులు ఇచ్చుకుంటూ స్పైసీ కంటెంట్ ఇస్తున్నారు. అయితే వీళ్ళను బిగ్ బాస్ ఎందుకు కవర్ చేయడం లేదనేది ఆసక్తికరంగా మారింది. ఎపిసోడ్స్ లో శ్రీసత్య-శ్రీహాన్ లను ఒక దశ వరకే చూపిస్తున్నారు. వారు సన్నిహితంగా ఉంటున్న సంఘటనలు చూపించడం లేదు. గతంలో రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి, అఖిల్-మోనాల్, అభిజీత్-హారికలను బిగ్ బాస్ ప్రత్యేకంగా కవర్ చేసేవారు. ఎపిసోడ్స్ లో చూపించేవారు. మరి శ్రీహాన్-శ్రీసత్య విషయంలో ఆయన పంథా ఎందుకు మారిందనేది ఆసక్తికరం. వాళ్ళ రొమాన్స్ కప్పిపుచ్చడం వెనుక బిగ్ బాస్ స్ట్రాటజీ ఏమిటో తెలియాల్సి ఉంది.

కాగా ఈ వారం హౌస్లో తొమ్మిది మంది ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ నిర్వహించిన టాస్క్ లో రాజ్ గెలిచి సేవ్ అయ్యాడు. దీంతో ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్, మెరీనా, శ్రీసత్య, శ్రీహాన్, కీర్తి, ఇనయా మొత్తం 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. వీరి నుండి వచ్చే వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. శ్రీసత్య ఎలిమినేట్ కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 10వ వారం డబల్ ఎలిమినేషన్ జరిగింది. బాల ఆదిత్య, వాసంతి బయటకు వెళ్లిపోయారు.