Bigg Boss 7 Telugu : మూడవ వారం నామినేషన్ లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్…

పవర్ అస్త్రాలు ఉన్న సందీప్ ,శివాజీకి కొత్తగా మరొక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆ టాస్క్ ఏంటంటే నామినేషన్ లో ఉన్న ఒక కంటెస్టెంట్లు సేవ్ చేయడంతో పాటు సేఫ్ గా ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరిని నామినేట్ చేసే అవకాశాన్ని బిగ్ బాస్ ఈ ఇద్దరికీ కల్పించారు

Written By: NARESH, Updated On : September 19, 2023 4:13 pm
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7లో మూడో వారం నామినేషన్స్ ఎంతో రసవత్తరంగా జరిగాయి. నామినేషన్ సందర్భంగా ప్రశాంత్ ను నామినేట్ చేసిన టేస్టీ తేజ కామెడీ కూడా చేశాడు. నామినేషన్ సందర్భంగా కొంతమంది కంటెస్టెంట్స్ తమను నామినేట్ చేసిన రీజన్స్ సరి అయినది కాదు అని గొడవకు దిగారు. అయితే యావర్ విషయంలో ఈ గొడవ కాస్త శృతి మించింది. ముఖ్యంగా దామిని.. యావర్ మధ్య గొడవ ఆ రేంజ్ లో జరిగింది.

మూడవ వారం నామినేషన్ కి గాను మొత్తం మీద ఏడు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.శుభశ్రీ, ప్రియాంక, దామిని, గౌతమ్, యావర్, రతిక, అమర్ దీప్ నామినేట్ అయినా కంటెస్టెంట్స్. ఇప్పటివరకు నామినేషన్ కి దూరంగా ఉంటూ వచ్చిన శుభశ్రీ పై కొందరు కంటెస్టెంట్ ఈసారి టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. శుభశ్రీ ఇంట్లో పని చేయడం లేదు అనే రీజన్ తో ఆమెను నామినేట్ చేయగా.. దీనికి అసలు ఒప్పుకొని శుభశ్రీ మాత్రం తాను పనిచేస్తున్నాను అని చెప్పుకొచ్చింది.

అయితే చపాతీలు చేసి అదే పని అనుకుంటే ఎలా అని మిగిలిన కంటెస్టెంట్స్ ఆమెను నిలదీశారు.అమర్ దీప్, రతిక, దామిని ముగ్గురు శుభశ్రీని నామినేట్ చేశారు. అయితే శుభశ్రీ మాత్రం ఈసారి తాను కచ్చితంగా పనిచేసే చూపిస్తాను. అని గట్టిగా చెప్పింది. ప్రిన్స్ యావర్ ఈ సారి నామినేషన్ విషయంలో బాగా డ్రామా చేశాడు. యావర్ ను దామిని నామినేట్ చేసినప్పుడు చాలా పెద్ద గొడవ జరిగింది. నేను డ్రామా చేస్తున్నానా అంటూ అతను పెద్ద సీన్ సృష్టించాడు. మరోపక్క హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య పుల్లలు పెడుతున్నాడు అని రీసెంట్ తేజ కూడా నామినేట్ అయ్యాడు.

పవర్ అస్త్రాలు ఉన్న సందీప్ ,శివాజీకి కొత్తగా మరొక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆ టాస్క్ ఏంటంటే నామినేషన్ లో ఉన్న ఒక కంటెస్టెంట్లు సేవ్ చేయడంతో పాటు సేఫ్ గా ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరిని నామినేట్ చేసే అవకాశాన్ని బిగ్ బాస్ ఈ ఇద్దరికీ కల్పించారు. అప్పటివరకు నామినేషన్ లో కేవలం ప్రశాంత్ అమర్ దీప్ మాత్రమే లేరు.దీంతో సందీప్ నామినేషన్ లో ఉన్న తేజను సేవ్ చేసి అమర్దీప్ ను సెలెక్ట్ చేశాడు. ప్రశాంత్ ను సేవ్ చేయడం కోసం తనని రిస్క్ లో పెట్టారు అని హర్ట్ అయిన అమర్ దీప్ కాస్త సీరియస్ అయ్యాడు.