https://oktelugu.com/

Kurchi Madathapetti : కుర్చీ పాటని మడతపెట్టేసిన శుభశ్రీ, టేస్టీ తేజ .. అదిరిపోయే స్టెప్పుల వీడియో వైరల్

శుభశ్రీ బిగ్ బాస్ హౌస్ లో ఉంది 5 వారాలే అయినప్పటికీ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా పెంచుకుంది. కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ వచ్చింది శుభ శ్రీ.

Written By:
  • NARESH
  • , Updated On : January 4, 2024 / 04:24 PM IST
    Follow us on

    kurchi madathapetti Song : ప్రస్తుతం సోషల్ మీడియాని గుంటూరు కారం కుర్చీని మడతపెట్టి సాంగ్ ఊపేస్తోంది. మహేష్ బాబు హీరో గా నటించిన గుంటూరు కారం సినిమాలోని మాస్ సాంగ్ ఇది. ఈ పాటపై మొదట్లో విమర్శలు వచ్చినప్పటికీ .. ఇప్పుడు ఇది నెట్టింట వైరల్ గా మారింది. దీంతో నెటిజన్స్ ఈ సాంగ్ కి రీల్స్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ క్యూట్ బ్యూటీ శుభశ్రీ రాయగురు, టేస్టీ తేజ ఈ పాటకు డాన్స్ చేశారు. ఇద్దరూ కలిసి అదిరిపోయే స్టెప్పులేస్తూ దుమ్ములేపేసారు.

    శుభ శ్రీ రాయగురు, టేస్టీ తేజ బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ ని సొంతం చేసుకున్నారు. టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్ లో ఫుడ్ వ్లాగ్స్ చేసుకుంటూ ఫేమస్ అయ్యాడు. కొంత కాలం జబర్దస్త్ ప్రోగ్రాం లో స్కిట్స్ చేసాడు. అలా పాపులారిటీ తెచ్చుకున్న తేజ బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా వచ్చి బెస్ట్ ఎంటర్టైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ శుభశ్రీ రాయగురు మనోభావాల పాపగా ఫుల్ ఫేమస్ అయింది.

    శుభశ్రీ బిగ్ బాస్ హౌస్ లో ఉంది 5 వారాలే అయినప్పటికీ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా పెంచుకుంది. కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ వచ్చింది శుభ శ్రీ. టేస్టీ తేజ తో కలిసి ఫుడ్ వ్లాగ్స్ చేసింది. తేజ, శుభ శ్రీ, గౌతమ్, ప్రియాంక జైన్, యావర్, నయని అంతా గెట్ టు గెదర్ అయ్యారు.

    అలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయిన టేస్టీ తేజ, శుభ శ్రీ తాజాగా సోషల్ మీడియాని ఊపేస్తున్న కుర్చీని మడతపెట్టి సాంగ్ కి స్టెప్పులేశారు. తేజ తో కలిసి డాన్స్ ఇరగదీసింది శుభశ్రీ. తేజ అయితే పంప్ స్టెప్పులతో షేక్ చేసాడు. దీంతో కొంత మంది క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తేజ, శుభ శ్రీ చేసిన రీల్ నెట్టింట వైరల్ గా మారింది.