Bigg Boss Keerthi: బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ దారుణంగా మోసపోయారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షలు పోగొట్టుకున్నారు. ఒక్క క్లిక్ తో కేటుగాళ్లు లక్షలు కాజేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనలా ఇంకెవరు మోసపోకూడదని తనకు జరిగిందంతా వివరిస్తూ వీడియో తీసి పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే .. ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు ఎక్కువైపోయారు. కొత్త కొత్త ఐడియాలతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. చదువుకున్న వారిని సైతం ఈజీగా మోసం చేస్తున్నారు.
సీరియల్ నటి కీర్తి భట్ మాటలు వింటే ఇలా కూడా డబ్బులు లాగేస్తున్నారా అని షాక్ అవ్వాల్సిందే. ఈ క్రమంలో కీర్తి భట్ కి ఒక కొరియర్ రావాల్సిందట. వారం రోజులైనా కొరియర్ రాకపోవడంతో మెయిన్ కొరియర్ సెంటర్ వాళ్లకి కాల్ చేసిందట. కాగా కొరియర్ మెహదీపట్నంలో ఉందని వారు చెప్పారట. ట్రాక్ చేసి చూడగా మెహదీపట్నంలో కొరియర్ ఉన్నట్లు చూపించిందట. ఆ తర్వాత ఆమెకు ఒక కాల్ వచ్చిందట.
మీకు రావాల్సిన కొరియర్ ఇంకా రీచ్ కాలేదు కదా అని వాళ్ళు అడిగారట. మీ అడ్రస్ సరిగా అప్డేట్ కాలేదు .. ఫుల్ అడ్రస్ వాట్సాప్ లో పంపమని చెప్పారట. వాళ్ళు చెప్పినట్లు అడ్రస్ పంపిందట. ఆ తర్వాత వాళ్ళు అప్డేట్ కాలేదంటూ ఒక లింక్ పంపారట. సదరు లింక్ పై క్లిక్ చేయగా మొదట రెండు రూపాయలు కట్ అయ్యాయట. రెండు రూపాయలే కదా అని లైట్ తీసుకుందట. ఆ తర్వాత రూ. 90 వేలు ఒక సారి మరోసారి రూ. 90 వేలు అలా రెండు లక్షలు అకౌంట్ నుంచి కట్ అయినట్లు మెసేజ్ లు వచ్చాయట.
వెంటనే తనకు కాబోయే భర్త కార్తీక్ కి చెప్పగా .. సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ ఇచ్చాడట. పోలీసులకు ఫిర్యాదు చేశారట. దీంతో పోలీసులు సైబర్ నేరగాళ్లు మనీ ట్రాన్స్ఫర్ చేసే వీలు లేకుండా అకౌంట్లు బ్లాక్ చేశారట. మొత్తం నాలుగు ఎకౌంట్లకు కీర్తి డబ్బు ట్రాన్స్ఫర్ అయిందట. మీ డబ్బులు 90 శాతం వెనక్కి వస్తాయి అని పోలీసులు హామీ ఇచ్చారట. నా లాగా మీరు మోసపోకూడదని .. జాగ్రత్తగా ఉండమని కీర్తి సూచింది.
Web Title: Bigg boss fame keerthi bhat lost 2 lakhs in cyber fraud
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com