Geethu Royal : గీతూ రాయల్ మొదట్లో టిక్ టాక్ వీడియోలు చేసేది. బిగ్ బాస్ రివ్యూలు చెప్తూ పాపులర్ అయింది. సోషల్ మీడియా స్టార్ హోదాలో బిగ్ బాస్ సీజన్ 6 లో ఛాన్స్ దక్కించుకుంది. హౌస్లో నానా రచ్చ చేసింది. ఒక దశలో తన ప్రవర్తనతో ఆడియన్స్ కి చిరాకు తెప్పించింది. దీంతో ప్రేక్షకులు గీతూ ని ఇంటికి పంపించారు. 9వ వారంలో ఎలిమినేట్ అయింది. ఆ షాక్ తట్టుకోలేక స్టేజి పై బోరున ఏడ్చింది. అనంతరం గీతూ బిగ్ బాస్ బజ్ సీజన్ 7 హోస్ట్ చేసింది. కాగా గీతూ రాయల్ తన కొడుకుని పోగొట్టుకుని ఇప్పుడు తీరని దుఃఖంలో ఉంది.
గీతూ రాయల్ 2021లో వికాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వారికి ఇంకా సంతానం కలగలేదు. అయితే సోషల్ మీడియాలో గీతూ కి కొడుకు ఉన్నాడు అంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. దానికి స్పందించిన గీతూ .. అవును నా కొడుకు ఉన్నాడు. వాడి పేరు ఓరియో. అది నా పిల్లి .. నాకు కన్న కొడుకు కంటే ఎక్కువ. అదే నా పంచ ప్రాణాలు అని చెప్పుకొచ్చింది. అల్లారుముద్దుగా చూసుకుంటున్న తన పెట్ ఒరియో చనిపోవడంతో గీతూ రాయల్ గుండెలు పగిలేలా ఏడుస్తుంది.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా ఒరియో అంటే తనకు చాలా ఇష్టం అని గీతూ చెప్పుకొచ్చింది. గత ఏడాది నుంచి ఒరియో కి కాస్త అనారోగ్యంగా ఉందట. దీంతో తన పిల్లిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తుందట. కొడుకులాంటి ఓరియో చనిపోవడంతో తీవ్ర భావోద్వేగంతో ఎమోషనల్ వీడియో షేర్ చేసుకుంది. ” ఓరియో నా బంగారు కొండ .. ఈ అమ్మ నిన్ను చాలా ప్రేమిస్తుంది నాన్నా .. ఇది చాలా అమాయకమైన పిల్లి.
జూలై 24 ఉదయాన్నే ప్రతిరోజు లాగే కమ్యూనిటీలో తిరగడానికి వెళ్ళాడు. ఉదయం 5.30 లోపు తిరిగి వచ్చేస్తాడు. కానీ ఆ రోజు మాత్రం ఇంటికి రాలేదు. మేము సాయంత్రం నాలుగు గంటల వరకు వెతికాం. తర్వాత తెలిసింది. ఓరియో మా కమ్యూనిటీ వెనుకే చనిపోయాడని. మా సెక్యూరిటీ గార్డ్స్ నిర్లక్ష్యం వల్ల కొన్ని వీధి కుక్కలు కమ్యూనిటీ లోపలికి వచ్చాయి. వారి కారణంగానే నా కొడుకు ఓరియో చనిపోయాడు.
ఊర కుక్కలన్నీ ఓరియో పై పడి కరిచాయి. వాడు ఎంత భయపడి ఉంటాడో నేను ఊహించగలను. అది ఊహించుకుంటే చాలా భయంగా అనిపిస్తుంది” అంటూ గీతూ రాయల్ కన్నీరు మున్నేరు అయ్యింది. చనిపోయిన ఓరియో కి స్నానం చేయిస్తూ .. పూడ్చి పెడుతూ గుండెలు పగిలేలా రోదించింది గీతూ రాయల్. ఈ వీడియో వైరల్ అవుతుంది. తన పెట్ క్యాట్ పోయిన బాధలో గీతూ రాయల్ గుండెలు అవిసేలా ఏడ్చింది. చూస్తుంటే గీతూ ఈ బాధ నుండి బయటపడేందుకు చాలా సమయం పడుతుంది. కాగా బిగ్ బాస్ 7 ఫినాలే రోజు కొందరు గీతూ రాయల్ కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. ఆమె పోలీస్ కేసు పెట్టారు.
Web Title: Bigg boss fame geetu royal heart broken as her pet cat died
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com