Divi Vadthya: బిగ్ బాస్ ఫేమ్ దివి బోల్డ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. హాట్ థైస్ కనిపించేలా క్రేజీ ఫోజులతో దివి సోషల్ మీడియాను షేక్ చేశారు. దివి అందాల జడివానలో కుర్రాళ్ళు తడిసిపోతున్నారు. ఫీలింగ్స్ ఆపుకోలేక క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దివి లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ కావాలనే ఆశలతో ముందుకు వెళుతున్న దివి తనలోని గ్లామర్ పవర్ పరిచయం చేస్తుంది.
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దివికి సరైన బ్రేక్ రాలేదు. ఆమెకు అంతగా ప్రాధాన్యం లేని చిన్న చిన్న పాత్రలు మాత్రమే దక్కాయి. మహేష్ మహర్షి చిత్రంలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించారు. మహేష్ తో ఆమెకు ఒకటి రెండు డైలాగ్స్ కూడా ఉన్నాయి. దివికి ఫేమ్ వచ్చింది మాత్రం బిగ్ బాస్ షోతోనే.
బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న దివి పర్వాలేదు అనిపించారు. ఫైనల్ కి చేరుతుంది అనుకుంటే ఆమె జర్నీ మధ్యలోనే ముగిసింది. పెద్దగా స్కిన్ షో చేయకపోవడం, అఫైర్స్ కి దూరంగా ఉండటంతో నిర్వాహకులు ఆమెకు పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. అందులోనూ దివి కొద్ది మందితో మాత్రమే సన్నిహితంగా ఉండేవారు. అమ్మ రాజశేఖర్ తో దివి స్నేహం చేశారు.
ఫైనల్ కి చేరుకోకున్నా దివికి కొంత గుర్తింపు వచ్చింది. బిగ్ బాస్ తర్వాత దివి అనే ఒక హీరోయిన్ ఉందని ప్రేక్షకులకు తెలిసింది. మెల్లగా ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. సినిమాలు , వెబ్ సిరీస్లలో ఆఫర్స్ మొదలయ్యాయి. ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ దివి ఒక రోల్ చేస్తారు. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.
అలాగే జీ తెలుగులో విడుదలైన మా నీళ్ల ట్యాంక్ మూవీలో దివి నటించారు. లీడ్ హీరోయిన్ గా ఒకటి రెండు చిత్రాల్లో దివి నటిస్తున్నారు. మునుపటితో పోల్చుకుంటే దివి కెరీర్ పర్లేదని చెప్పాలి. అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి. మంచి అవకాశం ఇస్తే తానేమిటో నిరూపించుకోవాలని పట్టుదలతో ఉంది. అదే సమయంలో ఎలాంటి పాత్రలకైనా సిద్ధం అన్నట్లు హింట్ ఇస్తుంది.
అందుకే సోషల్ మీడియా వేదికగా స్కిన్ షో చేస్తుంది. గ్లామరస్ అండ్ బోల్డ్ పాత్రలకైనా రెడీ అంటుంది. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ఆఫర్స్ రావు. దర్శక నిర్మాతలకు పొరుగింటి పుల్లకూర రుచిస్తుంది కానీ, ఇంట్లో ఉన్న వేట కూర నచ్చదు. ఒడ్డు పొడుగు ఉన్న దివికి ఆఫర్స్ రాకపోవడం నిజంగా దారుణం. బాలీవుడ్ అమ్మాయిలకు ఏమాత్రం తగ్గని ఫిగర్ దివి సొంతం. ఇకపైనైనా దివిని టాలీవుడ్ పట్టించుకుంటుందో లేదో చూడాలి