Homeఎంటర్టైన్మెంట్Ali Reza: అందమైన దేవతకు తండ్రిని అయ్యాను అంటున్న ... అలీ రెజా

Ali Reza: అందమైన దేవతకు తండ్రిని అయ్యాను అంటున్న … అలీ రెజా

Ali Reza: నటుడు, బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్‌ అలీ రెజా ఫుల్ ఆనందంలో ఉన్నాడు. ఆయన సతీమణి మసుమ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులందరికీ తెలియజేశాడు ఆలీ. ‘అందమైన దేవతకు తండ్రినయ్యానని సగర్వంగా చెప్తున్నాను… తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు, మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు’ అని పోస్ట్ చేశాడు. అలానే ఈ సంధర్భంగా తన పాపను ఎత్తుకున్న ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ వార్త తెలియడంతో ఆయన సన్నిహితులు, మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు, పలువురు సెలబ్రిటీలు. అభిమానులు… అలీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

bigg boss fame ali reza becomes father to baby girl

తెలుగులో పలు సిరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అలీ … నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. నటుడిగా సినిమాల్లో రాణిస్తూనే… మోడల్‌గానూ చేస్తున్నాడు ఈ యంగ్ నటుడు. ‘గాయకుడు’ సినిమాతో హీరోగా వెండితెరపై అరంగ్రేటం చేసిన అలీకి … ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత బిగ్‌బాస్‌ తెలుగు మూడో సీజన్‌లో పాల్గొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకోగలిగాడు.

నాగార్జునతో వైల్డ్‌ డాగ్‌ అనే సినిమాలో కీలకపాత్ర పోషించాడు అలీ. ఆ సీజన్ లో తనదైన గేమ్ తో , స్నేహంతో అలీ ప్రవర్తించిన తీరుకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ కారణం గానే టాప్ 5 లో నిలవగలిగాడు అలీ. కింగ్  నాగార్జున, మెగాస్టార్ చిరుల ప్రశంసలను కూడా అందుకున్నాడు. ‘గుండెల్లో దమ్మున్న దోస్త్‌ ఖాజా భాయ్‌’ అనే మరో సినిమాను చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించాడు. ప్రస్తుతం ఈ చిన్నారిని ముద్దాడుతున్న ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version