Bigg Boss 7 Telugu : శనివారం ఎపిసోడ్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హోస్ట్ నాగార్జున కొందరిపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. బిగ్ బాస్ హౌస్లో 27వ రోజు ఏం జరిగిందో చూద్దాం… నాగార్జున వస్తూనే బెల్ట్ తో వచ్చాడు. శివాజీ, సందీప్ లను నిల్చోమని మీకు అసలు కళ్ళు ఉన్నాయా లేవా? అని అడిగాడు. కళ్ళ ముందు అంత పెద్ద తప్పు జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేదని మండిపడ్డారు. ఫిజికల్ టాస్క్ లో గౌతమ్ పట్ల తేజా కఠినంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని నాగార్జున లేవనెత్తాడు.
తేజా గౌతమ్ మెడపై కొట్టాడు. బెల్టుతో లాగాడని నాగార్జున ఆవేశపడ్డారు. సంచాలక్ గా మీరిద్దరూ ఫెయిల్ అయ్యారని అసహనం వ్యక్తం చేశారు. తేజాకు కూడా చివాట్లు పెట్టిన నాగార్జున అతనికి శిక్ష వేశాడు. తేజా జైలుకి వెళ్ళాలి. గౌతమ్ చెప్పిన ప్రతి పని చేయాలి. అలాగే నెక్స్ట్ వీక్ అతడు నేరుగా నామినేట్ అవుతాడని చెప్పాడు. తర్వాత శుభశ్రీ తనతో శివాజీ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణ చేసిన నేపథ్యంలో ఈ పాయింట్ నాగార్జున తెరపైకి తెచ్చాడు.
శివాజీ నీతో అసభ్యంగా ప్రవర్తించాడా అని శుభశ్రీని అడిగాడు. అతడు నాకు దగ్గరగా రావడం ఇబ్బందిగా అనిపించింది. మీరు దూరం జరగండి అని చెప్పినా వెళ్ళలేదు అని శుభశ్రీ చెప్పింది. నాగార్జున ఆ వీడియో ప్లే చేశాడు. హౌస్లో ఉన్న మిగతా ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ ని నాగార్జున వాళ్ళ ఒపీనియన్ అడిగాడు. ప్రియాంక, శోభా శెట్టి మాకు శివాజీ తప్పుగా ప్రవర్తించిన భావన కలగలేదు అన్నారు. రతికా మాత్రం తప్పు అని శివాజీకి వ్యతిరేకంగా చెప్పింది. ఈ విషయంలో శివాజీని నాగార్జున సున్నితంగా హెచ్చరించారు.
తర్వాత నామినేషన్స్ లో జ్యూరీ మెంబర్స్ గా ఉన్న శుభశ్రీ, శివాజీ, సందీప్ లలో ఎవరు మీకు అన్యాయం చేశారు. పక్షపాతంగా వ్యవహరించారో చెప్పాలని నాగార్జున ఒక్కొక్కరినీ సీక్రెట్ రూమ్ కి పిలిచి అడిగారు. గౌతమ్ తో పాటు మరో ఇద్దరు శివాజీ పేరు చెప్పారు. సందీప్ పేరు మరో ముగ్గురు చెప్పారు. ఇద్దరికీ చెరో మూడు వ్యతిరేక ఓట్లు పడ్డాయి. దీంతో శివాజీ-సందీప్ లలో ఎవరు హౌస్ మేట్ కావడానికి అనర్హులో చెప్పాలని శోభా శెట్టిని అడిగాడు.
శోభా శెట్టి శివాజీ పేరు చెప్పింది. దాంతో శివాజీ పవర్ అస్త్రను బ్రేక్ చేయాలని నాగార్జున శోభా శెట్టికి చెప్పాడు. దాంతో శివాజీ పవర్ అస్త్ర కోల్పోయాడు. వీఐపీ రూమ్ తో పాటు ఇమ్యూనిటీ కోల్పోయాడు. ఇక నేడు ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అయ్యేది చెబుతానని నాగార్జున వెల్లడించారు…