Bigg Boss Contestants Remuneration: బిగ్ బాస్ హౌస్లో ఉండటం అంత సులభం కాదు. రోజుల తరబడి నాలుగు గోడల మధ్య ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతకాలి. కుటుంబ సభ్యులను వదులుకోవాలి. ఫోన్, టీవీ, సోషల్ మీడియా యాక్సెస్ ఉండదు. దీంతో పాటు మానసికంగా, శారీరకంగా ఒత్తిడి పెంచే గేమ్స్, టాస్క్స్ ఉంటాయి. కంటెస్టెంట్స్ బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఇంట్లో ఎవరి పనులు వారు చేసుకోవాలి. మరి ఇంత కష్ట పడుతున్నప్పుడు ఫలితం కూడా అదే స్థాయిలో ఉండాలి కదా…
బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ వారి ఫేమ్, డిమాండ్ పై ఆధారపడి ఉంటుంది. ఇక బిగ్ బాస్ తెలుగు 7లో 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా వారి రెమ్యూనరేషన్స్ బయటకు వచ్చాయి. వీరిలో అత్యధికం ఎవరు? అత్యల్పం ఎవరు? తీసుకుంటున్నారో చూద్దాం… అందుతున్న సమాచారం ప్రకారం నటుడు శివాజీ ఈసారి టాప్ సెలెబ్రిటీ హోదాలో ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. ఒకప్పటి ఈ హీరోకి నిర్మాతలు వారానికి రూ. 4 లక్షల ఒప్పందం మీద తీసుకొచ్చారట.
అనంతరం నటి షకీలాకు అత్యధిక రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. వారానికి రూ. 3.5 లక్షల రెమ్యూనరేషన్ ఆమెకు ఇస్తున్నారట. కిరణ్ రాథోడ్ కి రూ. 3 లక్షలు, ఆట సందీప్ కి రూ. 2.75 లక్షలు, నటి ప్రియాంక జైన్ కి రూ. 2.5 లక్షలు, దామినీ, రతికా రోజ్ లకు రూ. 2 లక్షలు వారానికి ఇస్తున్నారట. ఇక శోభా శెట్టికి రూ. 2.25 లక్షలు, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ రూ. 1 లక్ష, టేస్టీ తేజా రూ. 1.5 లక్ష ఒప్పందంపై హౌస్లో అడుగు పెట్టాడట. శుభశ్రీకి రూ. 1.75 లక్షలు, ప్రిన్స్ యావర్ రూ. 1.50 లక్షలు, ఫైనల్ గా అమర్ దీప్ చౌదరి రూ. 2.5 లక్షలు తీసుకుంటున్నాడట.
14 మంది కంటెస్టెంట్స్ లో అత్యధికంగా శివాజీ రూ. 4 లక్షలు తీసుకుంటుండగా సామాన్యుడు కోటాలో హౌస్లో అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కేవలం ఒక లక్ష తీసుకుంటున్నాడు. ఇక టైటిల్ గెలిచిన కంటెస్టెంట్ రూ. 50 లక్షలు గెలుచుకుంటాడు. కొందరు రెమ్యూనరేషన్ తో సంబంధం లేకుండా ఫేమ్ కోసం ఈ షోకి రావడం జరుగుతుంది.