https://oktelugu.com/

Bigg Boss 8 Telugu : మహేష్ బాబు ని దారుణంగా వెక్కిరించినా బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్.. సంచలనంగా మారిన వీడియో!

మహేష్ ఫ్యాన్స్ ఆవేశం తగ్గించుకొని ఇక్కడితో మ్యాటర్ వదిలేస్తే బాగుంటుంది అని పలువురు విశ్లేషకులు ఇస్తున్న సూచన. మరి ఈ అంశం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఈ వీడియో తర్వాత గీతూ మరో మూడు రివ్యూ వీడియోలు అప్లోడ్ చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 7, 2024 / 08:12 PM IST
    Bigg Boss Contestant Geetu Royal Video Despite Mocking Mahesh Babu

    Bigg Boss Contestant Geetu Royal Video Despite Mocking Mahesh Babu

    Follow us on

    Bigg Boss 8 Telugu : జబర్దస్త్ లో ఒక కమెడియన్ గా పాపులారిటీ ని సంపాదించి ఆ తర్వాత యూట్యూబ్ లో ‘గలాటా గీతూ’ అనే ఛానల్ ద్వారా సినిమాల రివ్యూస్ చెప్తూ క్రేజ్ ని సంపాదించుకున్న గీతూ రాయల్ బిగ్ బాస్ సీజన్ 6 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి చేసిన రచ్చ అంతా ఇంత కాదు. చాలామందికి ఈమె ఆట నచ్చింది, అలాగే ఎక్కువ శాతం మందికి ఈమె ఆట నచ్చలేదు. కానీ ఈమె ఎలిమినేషన్ కి గురైన రోజు ఆమె ఏడ్చిన ఏడుపుని చూసి గీతూ ని ఇష్టపడని వారు కూడా కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక బయటకి వచ్చిన తర్వాత పలు ఎంటర్టైన్మెంట్ షోస్ లో కనిపించిన గీతూ, బిగ్ బాస్ సీజన్ 7 బజ్ షో కి హోస్ట్ గా వ్యవహరించింది. ఒక్కమాటలో చెప్పాలంటే హోస్ట్ గా గీతూ చింపేసింది అనే చెప్పాలి. సోషల్ మీడియాలో నెటిజెన్స్ నుండి వచ్చిన నెగటివ్ కామెంట్స్ నిర్మొహమాటంగా అడుగుతూ, తన మనసులో ఉన్న మాటలను బయట పెట్టి కంటెస్టెంట్స్ ఉక్కిరిబిక్కిరి చేసింది.

    ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ‘బిగ్ బాస్ 8 ‘ రోజువారీ ఎపిసోడ్స్ కి సంబంధించిన రివ్యూస్ ని తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అయితే మొన్న నాగ మణికంఠ తన విగ్ ని పీకేస్తూ ఏడ్చిన సంఘటన గురించి మాట్లాడుతూ ఫ్లోలో మహేష్ బాబు కూడా జుట్టు తక్కువ ఉందని హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకున్నాడు, అందంగా కనిపించాలనుకోవడంలో తప్పు లేదు కదా, మణికంఠ అందుకే విగ్ పెట్టుకున్నాడు, దానికి ట్రోల్ల్స్ వేయాల్సిన అవసరం లేదంటూ గీతూ రాయల్ చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ సంబంధం లేకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు ని మధ్యలోకి లాగి ట్రోల్ చేసినందుకు గీతూ రాయల్ పై సోషల్ మీడియా లో మహేష్ అభిమానులు చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

    మహేష్ బాబు జోలికి వస్తే మీ ఇంటికి వచ్చి నిన్ను కొడుతాము, నీకేమైనా మహేష్ బాబు ఫోన్ చేసి చెప్పాడా?, నేను హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నాను అని, నీకు నోటి దూల ఎక్కువ అని చాలాసార్లు విన్నాను, ఇప్పుడు దగ్గర నుండి చూస్తున్నాం, మర్యాదగా మహేష్ బాబు కి క్షమాపణలు చెప్పు అంటూ మహేష్ అభిమానులు గీతూ రాయల్ కి వార్నింగ్ ఇస్తున్నారు. అయితే దీనిపై గీతూ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు, స్వతహాగానే యాటిట్యూడ్ తో ఉండే ఈ అమ్మాయి, బెదిరించే కొద్దీ ఇంకా ఎక్కువ చేస్తుంది, కాబట్టి మహేష్ ఫ్యాన్స్ ఆవేశం తగ్గించుకొని ఇక్కడితో మ్యాటర్ వదిలేస్తే బాగుంటుంది అని పలువురు విశ్లేషకులు ఇస్తున్న సూచన. మరి ఈ అంశం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఈ వీడియో తర్వాత గీతూ మరో మూడు రివ్యూ వీడియోలు అప్లోడ్ చేసింది.