కూతురిని చూసి మురిసి పోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్: బుల్లితెర నటుడు, మోడల్, యాంకర్, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజా తండ్రయ్యాడు. బుల్లితెర పై, వెండి తెరపై సందడి చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అలీ రెజా. తెలుగు సీరియల్స్ లో నటిస్తూ ప్రతి అమ్మాయి మనసును దోచుకున్న అలీ రేజా ‘పసుపు – కుంకుమ’ సీరియల్ తో బుల్లి తెరనే ఒక ఊపు ఊపేసాడు.
అంతే కాకుండా గాయం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ మధ్య నాగార్జున సరసన వైల్డ్ – డాగ్ లో కూడా నటించాడు. ఇక తన కెరీర్ ని ఒక మలుపు తిప్పింది మాత్రం బిగ్ బాస్ అనే చెప్పుకోవచ్చు. తన దైన ఆట తీరు, మాట తీరు తో అశేష అభిమానుల్ని సంపాదించాడు అలీ. అలా బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని తన కెరీర్ ని మలుచుకున్న అలీ రేజా ఇటీవలే ‘ గుండెల్లో దమ్మున్న దోస్త్ ఖాజా భాయ్ ‘ అనే మరో సినిమాని చేస్తున్నట్లు ప్రకటించాడు.
అలీ రెజా సతీమణి మాసుమ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఒక ‘అందమైన దేవతకు’ తండ్రియ్యానని సగర్వంగా చెప్పుకుంటున్నాను. తల్లి – బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు అలీ రెజా. కూతురిని ఎత్తుకుని ముద్దాడుతూ ఒక రీల్ వీడియో ని ఇన్ స్టాగ్రామ్ లో తన ఖాతా నుండి పంచుకున్నాడు. ఈ వీడియో నెటిజన్స్ ని చాలా ఆకట్టుకుంటుంది.