https://oktelugu.com/

Priyanka Jain : గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ప్రియాంక… హానీమూన్ ప్లాన్స్ కూడా రెడీ!

బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియాంక ఎటువంటి నెగిటివిటీ లేకుండా బయటకు వచ్చిందని అందుకు చాలా హ్యాపీ అని తెలిపారు. అయితే ప్రియాంక కి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలి అని ఆశలు ఉన్నాయట.

Written By:
  • NARESH
  • , Updated On : February 3, 2024 / 11:17 PM IST
    Follow us on

    Priyanka Jain : బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ ప్రియుడు శివ కుమార్ తో కలిసి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇక పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మౌనరాగం సీరియల్ లో కలిసి నటించిన శివ కుమార్ – ప్రియాంకలు ప్రేమలో పడ్డారు. ఇక అప్పటి నుంచి వారు కలిసే ఉంటున్నారు. పేరెంట్స్ అనుమతితో కొన్నేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు.

    అయితే తాజా ఇంటర్వ్యూలో ఈ జంట వారి పెళ్లి గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. శివ కుమార్ మాట్లాడుతూ .. మాకు పెళ్లి కాలేదు కానీ .. ప్రియాంక నా భార్యే. దేవుడి దయతో 2024 లోనే పప్పన్నం పెట్టాలని అనుకుంటున్నాం అని అన్నాడు. ఈ ఏడాది లోపే పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు శివ కుమార్ తెలిపాడు. ఒకవేళ ఈ ఇయర్ లో కాకపోతే 2025 లో కచ్చితంగా మా పెళ్లి చూస్తారు. ఇది పక్కా అంటూ బల్ల గుద్ది మరీ చెప్పాడు శివ కుమార్.

    అంతే కాదు పెళ్లి తర్వాత ప్రియాంకను తీసుకుని వరల్డ్ టూర్ వెళ్తాను అంటూ శివ అన్నాడు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నెవర్ ఎండింగ్ టేల్స్ లాగే నెవర్ ఎండింగ్ హనీమూన్ చేసుకుంటాము అంటూ కామెంట్ చేశాడు. అయితే వాళ్ళు పెళ్లి కాకుండా కలిసి ఉండటం పై చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు. మాకు మా బంధం గురించి క్లారిటీ ఉంది. మాపై వచ్చే బ్యాడ్ కామెంట్లను పట్టించుకోము. పట్టించుకుంటే హ్యాపీ గా ఉండలేము అంటూ ప్రియాంక – శివ కుమార్ అన్నారు.

    బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియాంక ఎటువంటి నెగిటివిటీ లేకుండా బయటకు వచ్చిందని అందుకు చాలా హ్యాపీ అని తెలిపారు. అయితే ప్రియాంక కి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలి అని ఆశలు ఉన్నాయట. పైగా ఫ్యామిలీ బాధ్యతలు ఉండటం వలన పెళ్లి చేసుకోవడం ఆలస్యం అయిందని చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు ఈ ఏడాది లోనే పెళ్లి ఉంటుందని గుడ్ న్యూస్ చెప్పారు ఈ ప్రేమ జంట.