Bigg Boss 9 Telugu Emmanuel: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) టైటిల్ విన్నర్ ఎవరు అని అడిగితే అందరూ తనూజ, లేదా కళ్యాణ్ లలో ఎవరో ఒకరు అని అందరూ అనుకోవడం వాస్తవం. ఎందుకంటే సోషల్ మీడియా లో పొలింగ్స్ మొత్తం వీళ్లిద్దరి మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతానికి కళ్యాణ్ టాప్ 1 స్థానం లో అధికారిక పోలింగ్ లో కూడా ఉన్నాడని కొంతమంది అంటూ ఉన్నారు. కానీ అసలు సిసలు ట్విస్ట్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ముఖ్యంగా ఇమ్మానుయేల్ విషయం లో తేలికగా తీసుకుంటే పవన్ కళ్యాణ్ మరియు తనూజ అభిమానులకు ఫినాలే వీక్ లో మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి ఏర్పడొచ్చు. ఆన్లైన్ ఓటింగ్ లో తనూజ, పవన్ కళ్యాణ్ లతో పోలిస్తే ఇమ్మానుయేల్ కి చాలా తక్కువ ఓటింగ్ అని మనకి అనిపించొచ్చు. కానీ మిస్సెడ్ కాల్ ఓటింగ్ లో మాత్రం వేరేలా ఉంది.
ఇమ్మానుయేల్ కి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్టు వేరే లెవెల్ లో ఉంది. టాస్కులు ఆడడం లో కానీ, ఎంటర్టైన్మెంట్ అందించడం లో కానీ ఇమ్మానుయేల్ కి మించిన తోపులు ఈ సీజన్ లో ఎవ్వరూ లేరు. ఆడియన్స్ అత్యధిక శాతం ఈ అభిప్రాయం తోనే ఉన్నారు. పైగా ఈ సీజన్ కి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడం తో, అత్యధిక వ్యూయర్ షిప్ వాళ్ళ వైపు నుండే వస్తుండడం తో, ఇమ్మానుయేల్ కి మిస్సెడ్ కాల్ ఓటింగ్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో పడుతున్నాయని టాక్. ఈ రేంజ్ లో బిగ్ బాస్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎవ్వరికీ నమోదు అవ్వలేదని, ఇమ్మానుయేల్ సరికొత్త చరిత్ర ని క్రియేట్ చేసాడని అంటున్నారు. 10 వారాలు నామినేషన్స్ లోకి రాకపోయినప్పటికీ కూడా ఇమ్మానుయేల్ కి ఈ రేంజ్ ఓటింగ్ ఉందంటే, ఇక ప్రతీ వారం నామినేషన్స్ లోకి వచ్చి ఉండుంటే ఆన్లైన్ ఓటింగ్ లో కూడా నెంబర్ 1 స్థానం లో ఉండేవాడేమో.
అంతే కాదు ఇమ్మానుయేల్ కి సెలబ్రిటీల సపోర్ట్ కూడా వేరే లెవెల్ లో ఉంది. ముఖ్యంగా జబర్దస్త్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న కమెడియన్స్ అందరూ ఇమ్మానుయేల్ కి ఓటు వెయ్యమని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ కారణం చేత ఆయనకు రికార్డు స్థాయిలో ఫోన్ కాల్ ఓటింగ్స్ పడుతున్నాయని టాక్. వచ్చే వారం టికెట్ టు ఫినాలే టాస్కులు ఉంటాయి. ఈ టాస్కులలో ఇమ్మానుయేల్ మరోసారి సత్తా చాటితే ఆయన తనూజ, పవన్ కళ్యాణ్ లను భారీ మార్జిన్ తో దాటే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.