Bigg Boss 9 Telugu : మరో రెండు రోజుల్లో కోట్లాది మంది బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఆతృతగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) మొదలు కాబోతుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ పై హైప్ ఈసారి ఇంతలా ఏర్పడడానికి కారణం బిగ్ బాస్ టీం ఎంచుకున్న కాన్సెప్ట్ నే. ఈ సీజన్ లో సామాన్యులు మరియు సెలబ్రిటీల మధ్య రణరంగం జరగబోతుంది. సామాన్యులను ఎంపిక చేసే ప్రక్రియ కోసం రీసెంట్ గానే ‘అగ్నిపరీక్ష’ అనే షోని నిర్వహించారు. ఈ షో ద్వారా ఎవరెవరు హౌస్ లోకి రాబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆరు మందిని హౌస్ లోపలకు పంపుతారట. వారిలో దమ్ము శ్రీజా,మాస్క్ మ్యాన్ హరీష్ కచ్చితంగా హౌస్ లోపలకు వెళ్ళిపోతారు. మిగిలిన నలుగురు ఎవరు అనేది తెలియాలంటే చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగనుంది.
అయితే గత రెండు సీజన్స్ లాగానే ఈ సీజన్ లో కూడా ‘గ్రాండ్ లాంచ్ 2.O’ ఉంటుందట. అంటే ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్ ద్వారా వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ హౌస్ లోపలకు అడుగుపెట్టబోతున్నారు అన్నమాట. మరి ఎవరు ఆ కంటెస్టెంట్స్?, ఎంతమంది వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య వైల్డ్ కార్డు ద్వారా నే లోపలకు రాబోతుంది అట. ఈమెని ముందుగా గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లోనే తీసుకొద్దామని అనుకున్నారట. కానీ చివరి నిమిషం లో బిగ్ బాస్ టీం నిర్ణయం మార్చుకుంది. గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కంటే ఈమెని వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా లోపలకు పంపితేనే మజా ఉంటుంది అని ఫిక్స్ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారు అట. అదే విధంగా అగ్ని పరీక్ష షోలో ఆడిషన్స్ లో మెరిసిన సింగర్ శ్రీతేజ్ ని కూడా వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ద్వారా లోపలకు పిలిచే అవకాశం ఉందట.
గత సీజన్ లో లాగా ఈ సీజన్ లో కూడా పాత సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ ని లోపలకు తీసుకొచ్చే కార్యక్రమాలు ఈసారి పెట్టుకోలేదట. మొత్తం ఫ్రెష్ కంటెస్టెంట్స్ నే తీసుకొని రాబోతున్నారట. స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అయ్యే సత్యభామ సీరియల్ హీరోయిన్ దెబ్జానీ ని వైల్డ్ కార్డు ద్వారా లోపలకు తీసుకొస్తారట. ముందుగా ఈమెను కూడా గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా నే తీసుకొద్దామని అనుకున్నారు కానీ, చివరికి ఇలా కుదిరింది. అదే విధంగా సీరియల్స్ లో హీరో గా ఎన్నో ఏళ్ళ నుండి నటిస్తున్న ఇంద్ర నీల్ కూడా ఈ షో లో కంటెస్టెంట్ గా వైల్డ్ కార్డు ద్వారా రాబోతున్నాడట. అగ్ని పరీక్ష షో నుండి మరో సామాన్యుడు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. నాలుగు వారాల తర్వాత ఈ రీ లాంచ్ ఎపిసోడ్ ఉండబోతుంది.