Bigg Boss 9 Telugu Voting: ప్రతీ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) సీజన్ లో టాప్ 5 గా ఎవరు నిలబడబోతున్నారు అనే విషయం పై నాలుగైదు వారాల తర్వాత ఆడియన్స్ కి ఒక క్లారిటీ వచ్చేది. కానీ ఈ బిగ్ బాస్ సీజన్ లో ఎవరెవరు టాప్ 5 గా ఉండబోతున్నారు అనేది చెప్పలేకపోతున్నారు ఆడియన్స్. ప్రతీ బిగ్ బాస్ సీజన్ కి విశ్లేషణలు చేసే రివ్యూయర్స్ కూడా చెప్పలేకున్నారు. ఎందుకంటే ఈ సీజన్ అంత కష్టం గా ఉంది కాబట్టి. అయితే మొదటి స్థానాలు మాత్రం ఫిక్స్ అయిపోయాయి. మొదటి స్థానం లో తనూజ ఎవ్వరూ అందుకోలేని రేంజ్ లో కొనసాగుతుండగా, పవన్ కళ్యాణ్ రెండవ స్థానం లో కొనసాగుతున్నాడు. ఇక మూడవ స్థానం లో నిన్న మొన్నటి వరకు కచ్చితంగా ఇమ్మానుయేల్ నిలుస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయనకు ఆ స్థానం చాలా కష్టమే అని చెప్పాలి.
ఎందుకంటే బిగ్ బాస్ హిస్టరీ లో వరుసగా 10 వారాలు నామినేషన్స్ లోకి రాని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఇమ్మానుయేల్ మాత్రమే. ప్రతీ కంటెస్టెంట్ కి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది అనే దానిపై అవగాహనా ఉంది. కానీ ఇమ్మానుయేల్ ఫ్యాన్ బేస్ పై ఎలాంటి అవగాహన లేదు. సోషల్ మీడియా పోల్స్ లో మూడవ స్థానం లో కనిపిస్తున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అధికారిక పోల్స్ లో ఆయన మూడవ స్థానం లో కొనసాగుతున్నాడా అంటే అనుసమానమే. ఎందుకంటే ఆడియన్స్ కి ఇమ్మానుయేల్ కి ఓటు వేసే అవకాశం రాలేదు. పరిస్థితి చూస్తుంటే ఇమ్మానుయేల్ టాప్ 5 లోకి రావడమే ఒక వండర్ లాగా అనిపిస్తోంది. ఆడియన్స్ ఓట్ల ద్వారా అయితే కష్టమే, కానీ ఆయన వచ్చే రెండు వారాల్లో కూడా నామినేషన్స్ లోకి రాకుంటే టికెట్ టు ఫినాలే రేస్ లో గెలిచి టాప్ 5 లో స్థానం సంపాదించే అవకాశం ఉంది.
ఇక టాప్ 5 లో రెండు స్థానాల కోసం రీతూ, డిమోన్ పవన్, భరణి, సంజన, సుమన్ శెట్టి, ఈ 5 మంది పోటీ పడుతున్నారు. ప్రస్తుతానికి వీరిలో భరణి అత్యధిక ఓట్లను సాధిస్తూ టాప్ 4 స్థానం లో కొనసాగుతున్నాడు. గత వారం డేంజర్ జోన్ లోకి వచ్చిన ఆయన, ఈ వారం ఏకంగా టాప్ 4 వరకు చేరడం అంటే, గత ఆదివారం ఎపిసోడ్ ఆయనపై చాలా సానుభూతి ని తీసుకొచ్చింది అనే చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ఆయనకు బాగా కనెక్ట్ అయ్యారు. పైగా ఈ వారంలో ఆయన నుండి మంచి కంటెంట్ కూడా వస్తోంది. కాబట్టి టాప్ 4 లో కొనసాగుతున్నాడు. మిగిలిన నలుగురిలో టాప్ 5 స్థానాన్ని దక్కించుకోవడానికి సరిసమానమైన అవకాశాలు ఉన్నాయి. వచ్చే రెండు వారాల్లో పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.