Bigg Boss 9 Telugu Updates: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో మొదటి రోజు నుండే గొడవలు తారా స్థాయిలో ఉన్నాయి. గొడవలు ప్రతీ సీజన్ లో సర్వ సాధారణమే, కానీ ఈ సీజన్ లో మాత్రం లిమిట్స్ దాటి వ్యక్తిగత కామెంట్స్ చేసుకుంటున్నారు కంటెస్టెంట్స్. రెండు రోజుల క్రితమే శ్రీజా ని సంజన సైకో అని పిలిచింది. ఇక ఆ తర్వాత హౌస్ లో గుడ్డు కోసం పెద్ద యుద్ధమే జరిగింది కానీ, ఎవ్వరూ కంట్రోల్ తప్పలేదు. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ హరీష్ చాలా పొగరున్న వ్యక్తి, కచ్చితంగా కంటెస్టెంట్స్ పై నోరు జారుతాడు అని ముందుగా అందరూ అనుకున్నారు కానీ, ఎంతటి హీట్ వాతావరణం వచ్చినా ఆయన నోరు జారడం లేదు. పర్లేదు అనుకున్నంత టఫ్ కాదు, వచ్చిన కొద్దిరోజులకే మార్పు వచ్చేసింది అని అనుకున్నారు అందరూ. కానీ ఈరోజు ఎపిసోడ్ తో ఆయన అసలు సిసలు మాస్క్ బయటపడింది అనుకోవచ్చు.
కాసేపటి క్రితమే నేటి ఎపిసోడ్ కి సంబంధించిన మొదటి ప్రోమో ని విడుదల చేశారు. ఈ ప్రోమో లో మాస్క్ మ్యాన్ మాట్లాడుతూ ‘తనూజ, భరణి, ఇమ్మానుయేల్..ఇన్ని రోజులు ఈ ముగ్గురిలో ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలతో పోట్లాడుతున్నాను అనుకున్నాను, కానీ ముగ్గురు అమ్మాయిలతో పోట్లాడాను అని ఇప్పుడే అర్థమైంది’ అంటూ చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఒక కంటెస్టెంట్ ఈ విధమైన కామెంట్స్ చేయడం ఎప్పుడూ జరగలేదు. మాస్క్ మ్యాన్ పెద్ద తప్పు చేసేసాడు. ఈ వీకెండ్ నాగార్జున చేత ఫుల్ కోటింగ్ పడే అవకాశాలు ఉన్నాయి. అంతటి స్కోప్ ఇచ్చాడు,కానీ నాగార్జున దీనిని అడ్రస్ చేస్తాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ వీడియో వేసి చూపిస్తే ఇమ్మానుయేల్,భరణి రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. కచ్చితంగా నామినేషన్స్ కి చాలా బలమైన పాయింట్స్ ఇచ్చేసాడు మాస్క్ మ్యాన్.
నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో ఇమ్మానుయేల్ కి అన్యాయం జరగడం మాత్రమే కాదు, ఘోరమైన అవమానం కూడా జరిగింది. అతన్ని పవన్ కళ్యాణ్ బాడీ షేమింగ్ చేసాడు, ఇక సంచాలక్ గా వ్యవహరించిన మనీష్ అయితే వైల్డ్ కార్డ్స్ వస్తారు కదా, అప్పుడు ఈయన్ని బయటకి పంపి వాళ్ళతో రీప్లేస్ చేయండి బిగ్ బాస్ అంటాడు. వాళ్ళిద్దరికీ ఒక న్యాయం , నాకు ఒక న్యాయమా?, సంచాలక్ గా నువ్వు ఫెయిల్ అని ఇమ్మానుయేల్ అన్నందుకు మనీష్ ఈ స్థాయి మాటలు మాట్లాడాడు. కేవలం మనీష్ మాత్రమే కాదు, అగ్నిపరీక్ష సామాన్యులు మొత్తం చాలా పొగరుగా వ్యవహరిస్తున్నారు. మాములుగా సెలబ్రిటీస్ ఇలా వ్యవహరిస్తారని అంతా ఊహించారు కానీ, సామాన్యులు ఇంత చేస్తారని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇక ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఎన్ని గొడవలు జరగబోతున్నాయి చూడాలి. ఎందుకంటే హౌస్ కి మొదటి కెప్టెన్ మన కంటెంట్ రాణి సంజన అయ్యింది కాబట్టి.
