Bigg Boss 9 Telugu Triple Elimination: గత వారం నుండి బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ఊహకందని గొడవలు జరిగాయి. ఫ్యామిలీ వీక్ కావడం తో కంటెస్టెంట్స్ అందరూ ఎంతో సంతోషం తో ఉన్నారు, వారం మొత్తం అలా గడిచిపోయిన తర్వాత శుక్రవారం రోజున తనూజ వెర్సస్ దివ్య మధ్య జరిగిన గొడవ టీఆర్ఫీ రేటింగ్స్ బ్లాస్ట్ అయ్యేలా చేసింది. దీంతో బిగ్ బాస్ టీం కూడా వీకెండ్ కి ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్లాల్సిన దివ్య ని ఎలిమినేట్ చేయకుండా నో ఎలిమినేషన్ పెట్టి హౌస్ లో ఉండేలా చేశారు. సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్ లో వీళ్లిద్దరి మధ్య హౌస్ దద్దరిల్లిపోయే రేంజ్ గొడవలు జరుగుతాయని అనుకుంటే, ఇద్దరు తమ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టి ఒకరిని ఒకరు కౌగలించుకునేలోపు అందరూ షాక్ కి గురయ్యారు. వీళ్ళ మధ్య గొడవలు జరగలేదు కానీ, ఇతర కంటెస్టెంట్స్ మధ్య మాత్రం సీజన్ మొత్తం జరగాల్సిన గొడవలు కేవలం నిన్నటి ఎపిసోడ్ లోనే జరిగాయి.
నిన్న ఒక్క ఎపిసోడ్ లో ఒకరికి కాదు, ఏకంగా ముగ్గురికి రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపేయొచ్చు. అంత పెద్ద గొడవలు జరిగాయి. ముందుగా సంజన గురించి మాట్లాడుకోవాలి. ఈమె బిగ్ బాస్ హిస్టరీ లో ఏ కంటెస్టెంట్ కూడా చేయరాని కామెంట్స్ చేసింది, ఈమెకు నోరు జారడం కొత్తేమి కాదు, కానీ ఈసారి అన్ని హద్దులు దాటేసింది. ఒక మహిళా అయ్యుండి, మరో మహిళ అయినటువంటి రీతూ చౌదరి పై అసభ్యంగా కామెంట్స్ చేయడం హౌస్ మేట్స్ అందరినీ షాక్ కి గురయ్యేలా చేసింది. నువ్వు ప్రతీ రోజు రాత్రి డిమోన్ పవన్ పక్కలో కూర్చుంటావు అంటూ ఆమె చేసిన కామెంట్స్ అత్యంత దారుణంగా అనిపించాయి. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షో కావడం తో బిగ్ బాస్ టీం చాలా వరకు మాటలను కట్ చేసి ఎపిసోడ్ లో టెలికాస్ట్ కానివ్వకుండా చేశారు.
ఇప్పటికే ఈమెకు అనేక అవకాశాలు ఇచ్చారు కాబట్టి, ఈసారి ఈమెని నాగార్జున క్షమించే అవకాశాలు అసలు లేవని చెప్పాలి. అదే విధంగా పవన్ కళ్యాణ్ గొంతుని డిమోన్ పవన్ పట్టుకోవడం కూడా చాలా పెద్ద తప్పు. ఇతనికి ఒకసారి రీతూ చౌదరి విషయం లో వార్నింగ్ వచ్చింది. ఈసారి అతను స్పష్టంగా గొంతు పట్టుకొని ఫిజికల్ అయ్యాడు కాబట్టి ఇతనికి కూడా రెడ్ కార్డు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. నిన్న ఇతను చేసిన ఓవర్ యాక్టింగ్ మామూలుది కాదు. కూర్చునే కుర్చీలను కాళ్లతో తన్నడం, రీతూ చౌదరి ని కొట్టేందుకు ఆమె మీదకు దూసుకొని వెళ్లడం వంటివి చేసాడు. అంతే కాకుండా రీతూ చౌదరి ని అనరాని మాట ఎదో అన్నాడు, అతను అన్న ఆ మాటని ఎపిసోడ్ లో మ్యూట్ చేశారు కానీ, హౌస్ మేట్స్ అందరూ నోరెళ్లబెట్టారు, అంత పెద్ద మాట ఏమన్నాడో తెలియాలంటే వీకెండ్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఇతనికి కూడా రెడ్ కార్డు ఇచ్చే అవకాశం ఉంది. ఇలా ఈ ముగ్గురు ఈ వారం చేయరాని తప్పులు చేశారు, ముగ్గురు కూడా రెడ్ కార్డు కి అర్హులే, మరి నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.