Bigg Boss 9 Telugu Ritu Choudhary: ప్రతీ బిగ్ బాస్ సీజన్ లోనూ గొడవలతో పాటు లవ్ ట్రాక్స్ కూడా కచ్చితంగా ఉండాల్సిందే. వీటిని కోరుకునే ఆడియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అయితే లవ్ ట్రాక్స్ అనేవి సహజంగా ఉండాలి, ఎదో కంటెంట్ క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తే చూసే ఆడియన్స్ కి చాలా చిరాకుగా అనిపిస్తాది. ప్రస్తుతం బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) లో అలాంటి లవ్ ట్రాక్ నే ఉండబోతుందా అంటే అవును అనే అనిపిస్తుంది. రీతూ చౌదరి(Ritu Chowdary) మొదటి రోజు నుండి చాలా యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది కానీ, ఈమెకు తన స్నేహితురాలు విష్ణు ప్రియా(Vishnu Priya) ని చూసి బాగా ప్రభావితమై, పులిహోర లవ్ ట్రాక్ లు నడపాలని ఫిక్స్ అయ్యి హౌస్ లోకి అడుగుపెట్టినట్టుగా అనిపిస్తుంది. హౌస్ లో ఈమె నిన్న పడాలా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో కలిపిన పులిహోర సహజత్వానికి చాలా దూరం గా ఉంది.
పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటే, రీతూ చౌదరి అక్కడ ఉంటుంది. హౌస్ లో అతనితో కలిసి ఆటలు ఆదుకోవడం, అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం, అతనితో కలిసి డ్యాన్స్ లు వేయడం వంటివి రెగ్యులర్ గా చేస్తూ వస్తుంది. ఈ ట్రాక్ ని చూసి సోషల్ మీడియా లో మరో రోడ్డు లవ్ స్టోరీ వచ్చేలా ఉంది రోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం కాస్త భయపడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. అతను టాస్కులు అదరగొట్టేస్తాడని అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన రీతూ చౌదరి వల్ల ట్రాక్ తప్పుతాడేమో అని భయపడుతున్నారు. గతం లో విష్ణు ప్రియా కారణంగా పృథ్వీ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యాడు. అదే విధంగా సీజన్ 5 విన్నర్ అవ్వాల్సిన షణ్ముఖ్ జస్వంత్, సిరి తో నడిపిన ట్రాక్ కారణంగా రన్నర్ గా మిగిలాడు.
ఇలా లవ్ ట్రాక్స్ మొత్తం కంటెస్టెంట్స్ ని గాడి తప్పించేలా చేశాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గాడి తప్పుతాడా?,లేదా కంట్రోల్ చేసుకొని గేమ్ మీద ఫుల్ ఫోకస్ పెడుతాడా అనేది చూడాలి. మరోపక్క రీతూ రీతూ చౌదరి డిమోన్ పవన్ తో కూడా పులిహోర కలుపుతుంది. నిన్న ప్రియా వీల్లద్దరినీ చూసి ఎందుకు ఇద్దరు అంత సిగ్గు పడుతున్నారు అని కామెంట్ చేసింది. చూస్తుంటే ఈమె ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడిపేలాగానే అనిపిస్తుంది. గతం లో కూడా రీతూ చౌదరి ‘కిరాక్ లేడీస్..కిలాడి బాయ్స్’ అనే ప్రోగ్రాం లో నిఖిల్ తో ఇలాంటి పులిహోర నే కలిపింది. ఈమె ఇక్కడే ఈ రేంజ్ లో ఉంటే ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటుందో అని అప్పట్లోనే అందరూ అనుకున్నారు. ఇప్పుడు లైవ్ గా చేసి చూపిస్తుంది. చూడాలి మరి ఈమె కూడా విష్ణు ప్రియా లాగా కేవలం పులిహోర కలపడానికి మాత్రమే పరిమితమా?, లేదంటే టాస్కులు కూడా ఆడుతుందా అనేది.
#RituChowdary – #kalyanpadala #BiggBossTelugu9 pic.twitter.com/sSrD5zMgkq
— TeluguBigg (@TeluguBigg) September 9, 2025