Bigg Boss 9 Telugu: నిన్నటి బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) ఎపిసోడ్ లో భరణి గారి కుటుంబం ఆడియన్స్ లో మంచి మార్కులు కొట్టేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. భరణి తమ్ముడు సుమన్ శెట్టి ప్రభంజనం సృష్టించాడు. అదే విధంగా భరణి కూతురు తనూజ టాస్కు గెలవకపోయినా, శరీరమంతా గాయాలు ఉన్నప్పటికీ అద్భుతంగా గేమ్ ఆడి లేడీ టైగర్ అని అనిపించుకుంది. ఇక చివర్లో భరణి కూడా డిమోన్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ తో పోరాడి గెలిచి, అతన్ని టికెట్ టు ఫినాలే రేస్ నుండి తప్పించాడు. ఇలా ఈ ముగ్గురు నిన్న టాస్కులలో తమ సత్తా చాటి ఆడియన్స్ నుండి మంచి మార్కులు కొట్టేశారు. నామినేషన్స్ లోకి వచ్చిన తనూజ అందరికంటే అత్యధిక ఓట్లతో మొదటి స్థానం లో ఉంది , ఆమెకు ఈ టాస్కులు గెలిచినా, గెలవకపోయినా పెద్ద నష్టం ఏమి ఉండదు, కానీ భరణి, సుమన్ శెట్టి లకు మాత్రం ఈ టాస్కులు బాగా కలిసొచ్చింది.
Also Read: కాంతారా’ హీరో రిషబ్ శెట్టి కి క్షమాపణలు చెప్పిన బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్..దెబ్బకు దిగొచ్చాడుగా!
నిన్న వీళ్లిద్దరి గ్రాఫ్ బాగా పెరిగింది. సుమన్ శెట్టి మొన్నటి వరకు అందరికంటే తక్కువ ఓట్లతో చివరి స్థానం లో కొనసాగేవాడు. ఈ వారం కచ్చితంగా ఆయన ఎలిమినేట్ అవుతాడు అని అనుకున్నారు అందరూ. కానీ నిన్నటి ఎపిసోడ్ ప్రభావం కారణంగా ఆయన ఓటింగ్ కాస్త పెరిగి డేంజర్ జోన్ నుండి బయటపడ్డాడట. ఇప్పుడు రీతూ చౌదరి డేంజర్ జోన్ లో ఉంది. ఇక మొన్నటి వరకు నాల్గవ స్థానం లో కొనసాగిన భరణి ఇప్పుడు మూడవ స్థానానికి చేరుకున్నాడట. కాబట్టి వీళ్లిద్దరు ప్రస్తుతానికి సేఫ్ జోన్ లో ఉన్నారు అని చెప్పొచ్చు. కానీ అందరికీ దాదాపుగా సమానమైన ఓటింగ్ పడుతోంది అనే చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే నిన్నటి ఎపిసోడ్ లో కొన్ని క్యూట్ మూమెంట్స్ ఆడియన్స్ మనసులను గెలుచుకుంది. హౌస్ మేట్స్ అందరూ తనూజ కి టాస్క్ లో సపోర్ట్ చేశారు.
కానీ భరణి ఒక్కడే సుమన్ కి సపోర్ట్ చేయడం హైలైట్ అనిపించింది. తనూజని తన సొంత కూతురు తో సమానంగా చూస్తున్నప్పటికీ, సుమన్ శెట్టి కూడా తనకు సోదర సమానుడు, అతన్ని ఎలా అయినా కాపాడుకోవాలి, ఇప్పుడు అతనికి నా అవసరం ఉంది అంటూ ఆయన వైపు నిల్చుకోవడం, సుమన్ ఆశలు వదిలేసుకుంటున్న సమయం లో అతన్ని మోటివేట్ చేసి టాస్క్ లో నిలబడేలా చేయడం, ఇలా ఒక విధంగా సుమన్ శెట్టి ధైర్యం గా నిలబడి గేమ్ ఆడి గెలవడానికి భరణి కూడా ముఖ్య కారణం అనడం లో ఎలాంటి సందేహం లేదు. అదే విధంగా మొదటి టాస్క్ లో తనూజ గెలవడం లో కూడా భరణి పాత్ర ఎంతోకొంత ఉంది. ఇలా ఒకవైపు తన వాళ్ళను గెలిపిస్తూ, మరో వైపు తన గేమ్ ఆడుతూ భరణి గడిచిన రెండు రోజుల్లో గేమ్ చేంజర్ లాగా నిలిచాడు.