Bigg Boss 9 Telugu nominations in week 9: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో ఎటు వైపు వెళ్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే గత సీజన్ వైల్డ్ రాకముందు చాలా బోరింగ్ గా ఉండేది. కానీ ఈ సీజన్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత బాగా డౌన్ అయిపోయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి వివాదాలు ఉన్న సెలబ్రిటీలనే వైల్డ్ కార్డ్స్ గా తీసుకొచ్చారు. కానీ వాళ్ళు ఈ సీజన్ పై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు. మాధురి వల్ల బలమైన కంటెంట్ అయితే వచ్చింది కానీ, అది పూర్తిగా నెగిటివ్. ఆరు మంది హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ గా ఎంటర్ అయితే, అందులో ముగ్గురు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం లో కూడా వైల్డ్ కార్డ్స్ గా ఎంట్రీ ఇచ్చిన వారిలోనే ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయిన ఇంటి సభ్యుల లిస్ట్ ఒకసారి చూద్దాం.
ఇమ్మానుయేల్ మరియు తనూజ మధ్య, అదే విధంగా తనూజ మరియు భరణి మధ్య నామినేషన్స్ సమయంలో చాలా పెద్ద గొడవలే జరిగాయట. కానీ ఇమ్మానుయేల్ మాత్రం నామినేషన్స్ లోకి రాలేదు, తనూజ, భరణి నామినేషన్స్ లోకి వచ్చారు. వీళ్ళతో పాటు రాము రాథోడ్, సాయి శ్రీనివాస్, సుమన్ శెట్టి, సంజన, పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా నామినేషన్స్ లోకి వచ్చారట. వీరిలో సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవ్వడానికి 99 శాతం అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హౌస్ లో ఇతను ఇప్పటి వరకు ఎలాంటి ప్రభావం చూపలేదు, ఈయన నుండి వచ్చిన కంటెంట్ సూన్యం. అంతే కాకుండా హౌస్ లో ఎక్కువగా పుల్లలు పెట్టే అలవాటు ఇతనికి ఉందని, కచ్చితంగా కన్నింగ్ కంటెస్టెంట్ అనే అభిప్రాయం జనాల్లో బలంగా ఉంది.
అదే విధంగా రాము రాథోడ్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఇతని నుండి కూడా ఈమధ్య కంటెంట్ రావడం లేదు, ఒకసారి డేంజర్ జోన్ లోకి కూడా వచ్చి వెళ్ళాడు. కాబట్టి ఇతను ఎలిమినేట్ అవ్వడానికి కూడా సమానమైన అవకాశాలు ఉన్నాయి. కానీ తనూజ కి రాము బాగా క్లోజ్ కాబట్టి, ఆమె వద్ద సేవింగ్ పవర్ ఇప్పటికీ సురక్షితంగానే ఉంది కాబట్టి, ఆమె ఆ పవర్ ని రాముకు ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారం సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవ్వడానికి నూటికి నూరు శాతం అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ వారం ఆయన టాస్కుల్లో బలమైన పెర్ఫార్మన్స్ ఇస్తే ఓటింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.