Bigg Boss 9 Telugu 13th week: ఊహకందని ట్విస్ట్స్, ఎమోషన్స్ మధ్య బ్లాక్ బస్టర్ సీజన్ గా అనిపించుకున్న బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) ఇప్పుడు 13వ వారం లోకి అడుగుపెట్టింది. 12 వ వారం లో హౌస్ లో స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్ గా కొనసాగిన దివ్య ఎలిమినేట్ అయ్యింది. గత వారమే ఆమె ఎలిమినేట్ అయ్యింది కానీ, చివర్లో బిగ్ బాస్ టీం నో ఎలిమినేషన్ పెట్టి దివ్య కి ఒక అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని ఆమె కరెక్ట్ గా ఉపయోగించుకుంటుంది అని అంతా అనుకున్నారు కానీ, అది జరగలేదు. భరణి తో బంధం కారణంగా ఆమె గేమ్ ఆయన చుట్టూనే తిరుగుతూ, చివరికి ఎలిమినేట్ అయ్యేలా చేసింది. ఇదంతా పక్కన పెడితే వారం కూడా నామినేషన్స్ ప్రక్రియ మంచి ఫైర్ వాతావరణం మధ్య జరిగింది. నేడు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.
ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చింది ఎవరంటే భరణి, డిమోన్ పవన్, తనూజ, రీతూ చౌదరి, సుమన్ శెట్టి మరియు సంజన. ఇప్పటికే విడుదలైన ప్రోమో లో నామినేషన్స్ ఎవరెవరి మధ్య జరిగిందో మనమంతా చూసాము. ఇమ్మానుయేల్ వచ్చి రీతూ చౌదరి ని నామినేట్ చేయగా, భరణి వచ్చి డిమోన్ పవన్, సంజన లను నామినేట్ చేస్తాడు. ఇక రీతూ చౌదరి అందరూ ఊహించనట్టు గానే గత వారం లో డేంజర్ జోన్ లోకి వచ్చిన సుమన్ శెట్టి ని నామినేట్ చేసింది. ఇక గొడవలు విషయానికి వస్తే సోల్ మేట్స్ గా కొనసాగుతూ వచ్చిన తనూజ, రీతూ చౌదరి మధ్య చాలా పెద్ద గొడవే జరిగినట్టు తెలుస్తోంది. అదే విధంగా భరణి, సంజన మధ్య కూడా గొడవ జరిగిందట. వీరిలో ఎవరి పాయింట్స్ కరెక్ట్ గా పేలాయి అనేది తెలియాలంటే రాత్రి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు ఆగాల్సిందే.
ఇక ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న కంటెస్టెంట్స్ రీతూ చౌదరి మరియు సుమన్ శెట్టి. సింగిల్ ఎలిమినేషన్ పెడితే సుమన్ శెట్టి, డబుల్ ఎలిమినేషన్ పెడితే రీతూ, సుమన్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రీతూ చౌదరి మంచి క్యాలిబర్ ఉన్న కంటెస్టెంట్ అయినప్పటికీ కూడా, డిమోన్ పవన్ తో రిలేషన్ కారణంగా ఆమె పై ఆడియన్స్ లో పూర్తిగా నెగిటివ్ ఫీలింగ్ ఉంది. ఈమె వల్ల టైటిల్ కొట్టేంత సత్తా ఉన్న డిమోన్ పవన్, కేవలం టాప్ 5 లోనే స్థిరపడ్డాడు అని అంతా అనుకుంటున్నారు. అంతే కాకుండా మొన్న ఆమె సంజన తో పెట్టుకున్న గొడవ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో బాగా చెడ్డ పేరు తెచ్చుకుంది. అందుకే ఈ వారం ఆమె డేంజర్ జోన్ లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక సుమన్ శెట్టి విషయానికి వస్తే ఇన్ని రోజులు హౌస్ లో ఆయన ఉండడమే వింత విషయం.