RRR Fun With Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతున్నాయి. శాసనసభలో కేవలం కూటమి పార్టీల ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకావడం లేదు. మండలికి మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్సీలు వస్తున్నారు. అయితే అసెంబ్లీలో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ నిషేధం పై సభలో బలమైన చర్చ నడిచింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పై మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఇది సరిగ్గా అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అనేది పక్కాగా జరపాలని ఆకాంక్షించారు. ప్రజల్లో బలమైన అవగాహన పెరగాలని అభిప్రాయపడ్డారు.
పవన్ అయితే ప్రజల్లోకి వెళ్తుంది..
అయితే ఇదే సందర్భంలో మాట్లాడారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ప్రజల్లోకి ఈ నిషేధం పై బలంగా వెళ్లాలంటే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాల్సిందేనంటూ తేల్చి చెప్పారు. ప్రముఖ హీరోతో యాడ్లు చేయాలంటే కోట్ల రూపాయలు అవసరం అని.. అదే మీరు అయితే మేనరిజం చూపిస్తే చాలు అది ప్రజల్లోకి బలంగా వెళ్తుందని రఘురామకృష్ణం రాజు అనేసరికి సభలో ఒక్కసారిగా నవ్వులు పూసాయి. పవన్ కళ్యాణ్ సైతం చిరునవ్వుతో దానిని ఆహ్వానించారు. ఈరోజు సభలో అదే హైలెట్ గా నిలిచింది. వైసిపి హయాంలో జనసైనికులు మీ పిలుపుతో రోడ్డు గుంతల్లో నాట్లు వేశారని గుర్తు చేశారు రఘురామకృష్ణంరాజు. దీంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా నవ్వేశారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారింది.
అర్థవంతమైన చర్చలు..
అసెంబ్లీలో కూటమి పార్టీల ఎమ్మెల్యేల మధ్య చర్చలు బాగానే నడుస్తున్నాయి. అయితే శాసనమండలిలో మాత్రం అధికార కూటమి, విపక్ష వైసిపి ఎమ్మెల్సీల మధ్య గట్టి వాదనలు జరుగుతున్నాయి. అర్థవంతమైన చర్చ నడుస్తోంది. అయితే శాసనసభలో వాడి వేడి సమావేశాలు లేవు కానీ.. ఇక్కడ కూడా అర్థవంతమైన చర్చలు నడుస్తుండడం విశేషం. ముఖ్యంగా సభ్యులకు విలువైన సమయాన్ని ఇస్తున్నారు. వారి సందేహాలను మంత్రులు నివృత్తి చేస్తున్నారు. అయితే మధ్య మధ్యలో రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ హోదాలో నవ్వులు పూజిస్తున్నారు.
Deputy Speaker to Deputy CM
“తరువాత మీ లాంటి హీరోలతో యాడ్ స్ చెయ్యాలంటే కోట్లు అవ్తుంది… కానీ ఒక్కసారి మీరు (కాలర్ ఎగరేసి) మీ ఫ్యాన్స్ కు చెబితే…#PawanKalyan pic.twitter.com/nzwpDDbGLA
— M9 NEWS (@M9News_) September 19, 2025