Bigg Boss 9 Telugu Thanuja Gowda: ‘బిగ్ బాస్ సీజన్ 9’ చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయింది. మొత్తానికైతే ఈ సీజన్ ఇంతకుముందు సీజన్లకు మించి ఉండబోతోంది అంటూ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక దాని ఏ మాత్రం తగ్గకుండా ఈ షో ను స్టార్ట్ చేశారు. ఈ షో లోకి మొదటి కంటెస్టెంట్ గా వచ్చిన ‘తనూజ’ సైతం తన ఎక్స్పీరియన్స్ ని చెబుతూనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తను భారీగా పోటీని ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది… మొదటి కంటెస్టెంట్ చాలా కాన్ఫిడెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా తనదైన సత్తా చూపిస్తూ తనకి పోటీ గా ఎంత పెద్ద కంటెస్టెంట్ ఉన్నా సరే తను గట్టి పోటీని ఇస్తానని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతోంది. అలాగే ఈసారి టైటిల్ కూడా తనదే అనే లెవెల్లో కాన్ఫిడెంట్ ను అయితే చూపిస్తోంది. ముఖ్యంగా తను ఇన్నోసెంట్ అని చెబుతూనే బిగ్ బాస్ హౌస్ లో మాత్రం అలా ఉంటే వర్కౌట్ కాదని చెప్పింది. అలాగే తను సీరియల్ కెరియర్ ని స్టార్ట్ చేసినప్పుడు తన పేరెంట్స్ చాలా ఇబ్బంది పడ్డారని, కానీ వాళ్ళను ఎదిరించి మరీ సీరియల్స్ చేసి వాళ్ళకి మంచి గుర్తింపు తీసుకొచ్చానని అలాగే హైదరాబాద్ లో వాళ్ళకంటూ సెపరేట్ ఇల్లు ను ఏర్పాటు చేసి వాళ్ళను బాగా చూసుకుంటున్నానని ఆమె చెప్పింది.
ఆమె చెప్పిన మాటలు ఆమె ఎలాంటి పరిస్థితినైనా సరే తనకు అనుకూలముగా మార్చుకొని పోరాటం చేసే ఘాట్స్ తనకి ఉన్నాయని చెప్పకనే చెప్పింది. మరి ఇప్పటివరకు తనూజ చేసిన సీరియల్స్ వల్ల ఆమెను ప్రతి ఇంట్లో ఒక కూతురులా చూసుకుంటున్నారు అంటూ ఆమె స్టేట్మెంట్ అయితే ఇచ్చింది.
ఇక ఆమె సీరియల్ చూసిన ప్రతి ఒక్కరు తన అభిమానిగా మారిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళందరూ కలిసి తనకు సపోర్టుగా నిలిచి ఆమెను ఫైనల్ దాకా పంపించే ప్రయత్నం చేస్తారా? లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికైతే నాగార్జున తనూజ ను హౌస్ లోకి పంపించే ముందు అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్లు అంటూ వాళ్ళని పరిచయం చేశాడు.
వాళ్లలో ఎవరు మీకు పోటీ ఇస్తారు అనుకుంటున్నారు అంటే వాళ్లు పెద్దగా తనకు పోటీ రారు అన్నట్టుగా తనూజ మాట్లాడింది…ఇక తన కాన్ఫిడెంట్ కి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక హౌజ్ లోకి వచ్చాక కూడా తను అంతే కాన్ఫిడెంట్ గా టాస్క్ లను ఆడుతూ బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంటర్ టైన్ చేస్తూ అందరిని ఓడిస్తూ ముందుకు సాగుతుందా లేదా అనేది చూడాలి…