Bigg Boss 9 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో లో ఒక్కరంటే ఒక్కరు కూడా కరెక్ట్ గా వ్యవహరించడం లేదు. నిజమైన బంధాలు లేవు, ప్రతీ బంధం అవసరం కోసం పుట్టుకొచ్చినదే. గత సీజన్స్ లో ఇలా ఉండేది కాదు. ఏర్పడిన బంధాల్లో కనీసం ఒక్కటి అయినా నిజాయితీగా ఉండేది. కానీ ఈ సీజన్ ని చూస్తే బీపీ పేషెంట్స్ కి బీపీ పెరగడం తప్ప మరొకటి లేదు. అందరిలో తన గేమ్ కోసం ఎలాంటి పని చేయడానికైనా సిద్దపడే కంటెస్టెంట్ ఎవరైనా హౌస్ లో ఉన్నారా అంటే అది తనూజ నే. అందులో ఎలాంటి సందేహం లేదు. హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుండే ఈమె భరణి కి బాగా కనెక్ట్ అయ్యింది. ఎక్కడా లేని విధంగా ‘నాన్న..నాన్న’ అని ఆయన్ని పిలుస్తూ, ఆయన చుట్టూనే తిరుగుతూ ఉండేది. ప్రతీ విషయం లోనూ మా నాన్న నాకు సపోర్టు చేయాలి, నాకోసం స్టాండ్ తీసుకోవాలి అని కోరుకునేది.
ఇదంతా నిజమైన బంధం అని మొదట్లో అందరూ నమ్మారు. కానీ భరణి రీ ఎంట్రీ తర్వాత తెలిసింది, ఇదంతా ఫేక్ అని. మొదటి నుండి నాన్న అని పిలుస్తూ అకస్మాత్తుగా భరణి గారు అని పిలవడాన్ని ఆడియన్స్ అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. గేమ్ ఆడాలంటే రిలేషన్ ని పక్కన పెట్టమని ఎవరు చెప్పారు?, రీతూ చౌదరి, డిమోన్ పవన్ లు రిలేషన్ పెట్టుకున్నప్పటికీ కూడా బాగానే ఆడుతున్నారు కదా, ఇమ్మానుయేల్ మరియు సంజన మధ్య తల్లి కొడుకుల బాండింగ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు కదా?, అలా ఈమె ఎందుకు ముందుకు పోవడం లేదు అనేది అనేక మందిలో కలిగిన ప్రశ్న. ఇక నిన్న కెప్టెన్సీ కంటెండర్ నుండి దివ్య తనూజ ని తప్పించినప్పుడు, తనూజ ఆవేశం తో భరణి సార్ వల్లే నువ్వు నన్ను ఈ టాస్క్ నుండి తప్పించావు అనడం చాలా పెద్ద తప్పు అనే చెప్పాలి.
తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా భరణి అనవసరం గా నిన్న మానసిక వేదన అనుభవించాల్సి వచ్చింది. ఇక కెప్టెన్ అవ్వడం కోసం బిగ్ బాస్ హిస్టరీ లో ఏ కంటెస్టెంట్ చెయ్యని పనులు కూడా చేస్తోంది తనూజ. తనతో పోటీ పడుతున్న రీతూ చౌదరి ని తగ్గమని అడగడం, తగ్గితే వచ్చే వారం కెప్టెన్సీ కంటెండర్ గా నిన్ను నిల్పేందుకు సహాయం చేస్తాను అని మాట ఇవ్వడం, దాంతో పాటు ఎలిమినేషన్ రౌండ్ లో ఒకవేళ వస్తే, తన దగ్గర ఉన్నటువంటి సేవింగ్ పవర్ ని నీ కోసం ఉపయోగిస్తాను అని అనడం, ఆ ఎలిమినేషన్ రౌండ్ లో భరణి సార్ ఉన్నా నీకే ఉపయోగిస్తానని అనడం అందరినీ షాక్ కి గురి చేసింది. కెప్టెన్ అవ్వడం కోసం, నాన్న ని తాకట్టు పెట్టడమా?, అంటే ఇన్ని రోజులు మనం చూసింది టీవీ సీరియల్ యేనా?, అందులో ఎలాంటి నిజం లేదా అనే అనుమానాలు ఆడియన్స్ లో వ్యక్తం అవుతున్నాయి.