Bigg Boss 9 Telugu Tanuja Nominated Divvela Madhuri: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా వచ్చిన వారిలో దివ్వెల మాధురి వేరే లెవెల్ కంటెంట్ ఇస్తుంది. మొదటి వారం లో ఈమె చాలా బలుపు చూపించింది. ఒక్క తనూజ ని తప్ప, కంటెస్టెంట్స్ అందరినీ చిన్న చూపు చూసింది. నోటికి వచ్చినట్టు మాట్లాడి, తిరిగి ఎవరైనా కౌంటర్ ఇస్తే గొంతు తగ్గించు, అంటూ బలుపుతో మాట్లాడేది. అయితే గత వీకెండ్ లో నాగార్జున నుండి కష్టింగ్ పడడం తో పాటు, ఆడియన్స్ కూడా ఆమె ప్రవర్తన ని నచ్చడం లేదనే విషయం తెలుసుకొని కంటెస్టెంట్స్ అందరితో పాజిటివ్ గా ఉండడం మొదలు పెట్టింది. మొదటి వారం మొత్తం ఈమె దివ్య తో ఏ రేంజ్ లో గొడవలు పెట్టుకుందో మనమంతా చూశాము. కానీ వీకెండ్ ఎపిసోడ్ లో భరణి ఎలిమినేట్ అవ్వగానే, దివ్య ని దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేసింది.
దివ్య కూడా ఈమెతో మంచిగా ఉండడం మొదలు పెట్టింది. అంతే కాకుండా గత వారం ఆమెకు పవన్ కళ్యాణ్, రీతూ చౌదరి లతో కూడా గొడవ జరిగింది. వాళ్ళతో కూడా ఈమె మంచిగా ఉండడం మొదలు పెట్టింది. అదంతా ఫేక్ నటన అని అందరికీ తెలుసు. కానీ ఎంత ఫేక్ గా ఉన్నా, బిగ్ బాస్ హౌస్ లో ఎదో ఒక సమయం లో మాస్క్ ఊడి బయటపడాల్సిందే. అలా ఈమె మాస్క్ కూడా బయటపడింది. శుక్రవారం ఎపిసోడ్ లో ఈమె రీతూ చౌదరి పట్ల ఏ రేంజ్ లో నోరు జారిందో మనమంతా చూశాము. ఇంత దారుణంగా రీతూ చౌదరి ని బయట కూడా ఎవరు తిట్టి ఉండరేమో. అలా తన ఒరిజినల్ క్యారక్టర్ ని బయటపెట్టేసుకుంది. ఇక ఆ తర్వాత శనివారం ఎపిసోడ్ ప్రారంభం సాయి తో కూడా ఇలాగే రెచ్చిపోయి మాట్లాడి నోరు జారింది.
ఇలా కంటెస్టెంట్స్ అందరితో నోరు జారి మాట్లాడిన మాధురి తనూజ తో మాత్రం చాలా మంచిగా ఉంటుంది. ఆమె నాకు ఎలాంటి రిలేషన్స్ వద్దు, నాతో అసలు ఉండకు, వెళ్ళిపో అని ముఖం మీద చెప్పినప్పటికీ కూడా వదలడం లేదు. కారణం తనూజ కి భారీ ఓటింగ్ ఉంది, నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు ఆమె ఫ్యాన్ బేస్ ఓట్లు నాకు పడుతాయి అనే ప్లానింగ్ అన్నమాట. అయితే తనూజ, భరణి మధ్య ఏర్పడిన బాండింగ్ ని జనాలు నమ్మారు, అలా మాధురి, తనూజ బాండింగ్ ని నమ్మడం లేదు. కాబట్టి తనూజ ఓటింగ్ షిఫ్ట్ అవ్వడం కష్టమే. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తనూజ , మాధురి ని డైరెక్ట్ గా నామినేట్ చేసిందట. ఆదివారం జరిగిన ఒక టాస్క్ లో తనూజ కి గోల్డెన్ బజర్ దక్కుతుంది. దీంతో ఒకరిని ఎలిమినేషన్ నుండి సేవ్ చేయొచ్చు, ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేయొచ్చు. శనివారం ఎపిసోడ్ లో అత్యధిక బోర్డులు మాధురి కి పడ్డాయి. కచ్చితంగా ఆమెకు శిక్ష వెయ్యాలి కాబట్టి నాగార్జున ఆమెకు రెండు ఛాయస్ లు ఇస్తాడు. ఒకటి గార్డెన్ మరియు ఇల్లు క్లీనింగ్, రెండు డైరెక్ట్ నామినేషన్. ఇది తనూజ చేతిలో నిర్ణయం పెడుతాడు. అప్పుడు మాధురి నాకు క్లీనింగ్ వద్దు, డైరెక్ట్ గా నామినేషన్ లోకి వెళ్తాను అనే ఛాయస్ ని ఎంచుకుంది.