Bigg Boss 9 Telugu Suman Shetty: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి సెలబ్రిటీ కంటెస్టెంట్స్ జాబితాలో అడుగుపెట్టిన సుమన్ శెట్టి ని చూసి, మొదట్లో ఆడియన్స్ ‘పాపం చాలా అమాయకుడు లాగా ఉన్నాడు..హౌస్ లో నెగ్గుకు రాగలడా?, టాస్కులు ఆడగలడా?’ అని అంతా అనుకున్నారు. పొరపాటున కూడా నామినేషన్ లోకి రాకూడదు,వస్తే మొదటి వారమే ఎలిమినేట్ అయిపోతాడు అని అంతా అనుకున్నారు. కానీ గత వారం నామినేషన్స్ సమయం లో సంజన కి చాలా సైలెంట్ గా ఇచ్చిన ఒకే ఒక్క కౌంటర్ తో సుమన్ శెట్టి కి ఓవర్ నైట్ ఫాలోయింగ్ వచ్చేసింది. అంతే కాదు అదే రోజున ఆయన టాస్కుని కూడా చాలా చురుగ్గా ఆడి హౌస్ మేట్స్ అందరినీ సర్ప్రైజ్ కి గురి చేసాడు. దీంతో సుమన్ శెట్టి ఆడియన్స్ కి ఫేవరెట్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా మారిపోయాడు. నేడు కూడా ఆయన నామినేషన్స్ ప్రక్రియ లో తనదైన మార్కుని చూపించాడు.
కెప్టెన్ ఛాయస్ ప్రకారం ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసి నామినేట్ చేయండి అని బిగ్ బాస్ సంజన కి చెప్పడం తో ఆమె సుమన్ శెట్టి ని నామినేట్ చేస్తుంది. నామినేట్ చేస్తూ ‘నేను ఎవరినీ వ్యక్తిగతంగా తొక్కలేదు’ అని అనగానే, సుమన్ శెట్టి ‘ఆ ఇక చాలు రంగు ముఖానికి రాయండి’ అని అంటాడు. అరవకండి అని సంజన అన్నప్పుడు, సుమన్ శెట్టి ‘రాయండి మేడం..టైం ఎందుకు వేస్ట్ చేస్తారు’ అని సెటైర్స్ వేస్తాడు. ఒక పక్క సంజన ని, మరో పక్క ప్రియా ని సుమన్ శెట్టి నామినేషన్స్ ప్రక్రియ లో ఒక రేంజ్ లో ఆడేసుకున్నాడు. అందుకు సంబంధించిన ప్రోమో ని మీరు క్రింద చూడవచ్చు. సుమన్ శెట్టి లో ఈ యాంగిల్ ని చూసి ప్రేక్షకులు అబ్బో మనోడిలో చాలా టాలెంట్ ఉందే, హౌస్ కి సరిపోతాడు అని బలంగా ఫిక్స్ అయిపోయారు.
ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన సుమన్ శెట్టి, అందరికంటే అత్యధిక ఓటింగ్ తో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు. ఆయన తర్వాతి స్థానం లో భరణి కొనసాగుతున్నాడు. సుమన్ శెట్టి ఇదే విధంగా తనలోని యాంగిల్స్ బయటకు తీస్తూ పోతూ, టాస్కులు కూడా అద్భుతంగా ఆడితే కచ్చితంగా ఆయన టాప్ 5 వరకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు నెటిజెన్స్. సాధారణంగా ప్రియా నోటికి ఎవ్వరూ వెళ్లలేరని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ సుమన్ శెట్టి ఒక పక్క ప్రియా తో ఆదుకోవడమే కాకుండా, హౌస్ మొత్తాన్ని ఒక ఆట ఆడించిన సంజన తో కూడా ఆడుకోవడం చిన్న విషయం కాదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో మనోడు ఇంకా ఎన్ని షేడ్స్ చూపించబోతున్నాడు అనేది.
High voltage nominations!
Real opinions revealed, #SumanShetty breaks his silence! ️Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/GWBvnmNOQ1
— Starmaa (@StarMaa) September 16, 2025