Bigg Boss 9 Telugu Sanjana Vs Suman Shetty: పాజిటివ్ లేదా నెగిటివ్, ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ బ్లాక్ బస్టర్ వైపు పరుగులు తీస్తుందంటే అందుకు ముఖ్య కారణం సంజన నే అని చెప్పొచ్చు. టీఆర్ఫీ రేటింగ్స్ బ్లాస్టింగ్ రేంజ్ లో వచ్చాయి కాబట్టే, బిగ్ బాస్ ఆమెని ప్రత్యేకంగా కన్ఫెషన్ రూమ్ కి పిలిపించి, ఆమెని మెచ్చుకొని, కెప్టెన్సీ కంటెండర్స్ ని మీరే ఎంపిక చేసే పవర్ ని మీ చేతుల్లో పెడుతున్నాను అని అంటాడు బిగ్ బాస్. దీంతో ఆమెకు కొత్త రెక్కలు వచ్చేసాయి. బిగ్ బాస్ ఈ మాత్రం ప్రోత్సాహం అందిస్తే చాలు, అల్లాడించేస్తా అనే రేంజ్ లో కన్ఫెషన్ రూమ్ నుండి బయటకు వచ్చింది సంజన. కానీ ఆమె ఎంటర్టైన్మెంట్ ని అందించే ప్రక్రియ లో ఒక సున్నితమైన గీత ని దాటేస్తుంది. ఇది ఏ మాత్రం మానవీయ కోణం కాదు అనే చెప్పాలి.
Also Read: ‘మిరాయ్’ ట్విట్టర్ టాక్..ప్రభాస్ ఎంట్రీ కి సెన్సేషనల్ రెస్పాన్స్..సినిమా హిట్టా? ఫట్టా?
సుమన్ శెట్టి సిగరెట్స్ ని దొంగతనం చేసి, అతనికి కనిపించనంత దూరంగా దాచిపెట్టింది సంజన. పాపం సుమన్ శెట్టి హౌస్ మొత్తం ఆ సిగరెట్స్ కోసం వెతుకుతాడు. ఇమ్మానుయేల్ కి ఇది కచ్చితంగా సంజన నే దోచేసింది అనే విషయం అర్థమై, మీరే దోచేశారు కదా?, నాకు తెలుసు, పాపం ఇచ్చేయండి అతనికి , అది మంచిది కాదు అని అంటాడు. నేను అసలు దొంగతనం చెయ్యలేదు ఇమ్ము, ఎందుకు ఇంట్లో ఏ పొరపాటు జరిగిన అందరూ నన్నే తప్పు పడుతున్నారు అని అంటుంది సంజన. కానీ ఇమ్మానుయేల్ నమ్మడు, హౌస్ లో ఎవ్వరూ కూడా నమ్మరు. ఇక చివర్లో సుమన్ శెట్టి స్వయంగా వచ్చి సంజన ని అడుగుతాడు. మీరేమైనా తీసి ఉంటే, దయచేసి ఇచ్చేయండి ప్లీజ్ అని బ్రతిమిలాడుతాడు. అప్పుడు సంజన ఆస్కార్ రేంజ్ పెర్ఫార్మన్స్ చేస్తూ నేను నిజంగానే తియ్యలేదు సుమన్ గారు అని అంటుంది.
అనంతరం అతను బయటకు వెళ్లిన తర్వాత కెమెరా వద్దకు వచ్చి ‘సిగరెట్స్ ని నేనే దొంగతనం చేశాను బిగ్ బాస్. అతని ఆరోగ్యానికి సిగరెట్ మంచిది కాదు అని చెప్పుకొస్తుంది. సిగరెట్స్ తాగడం మంచి అలవాటు కాదు, అది నిజమే. కానీ ఆ సిగరెట్ అనేది సుమన్ కి ఎమోషన్, ఒక వ్యసనం లాంటిది. అది దొరక్కపోతే బుర్ర పనిచేయదు, ఆట మొత్తం చెడిపోతుంది. ఇలా ఎంటర్టైన్మెంట్ పేరుతో ఒకరి ఎమోషన్స్ తో ఆదుకోవడం ఎంత వరకు కరెక్ట్ చెప్పండి. సీజన్ 6 లో గీతూ రాయల్ అనే కంటెస్టెంట్ బాలాదిత్య వద్ద ఇలాగే సిగరెట్స్ ని దొంగతనం చేసి, అతన్ని టార్చర్ చేస్తుంది. ఇది ఆమెపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడేలా చేసింది. ఫలితంగా ఆమె అదే వారం లో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. సంజన కూడా ఎంటర్టైన్మెంట్ మరియు సెంటిమెంట్స్ కి మధ్య ఉన్న చిన్న లైన్ ఇలా పదే పదే దాటితే ఈమె కూడా షో మధ్యలోనే ఎలిమినేట్ అవకాశాలు పెరుగుతాయి. మరి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఈమె ప్రవర్తన ని కొన్ని విషయాల్లో మార్చేలా చేస్తాడో లేదో చూడాలి.