Bigg Boss 9 Telugu Emmanuel: గత వీకెండ్ లో అక్కినేని నాగార్జున మొదటి వారం నుండి హౌస్ లో ఓనర్స్ గా ఉంటున్న సామాన్యులను టెనెంట్స్ గా మార్చి, టెనెంట్స్ గా ఉంటున్న సెలబ్రిటీస్ ని ఓనర్స్ గా మార్చారు. సామాన్యులు ఓనర్స్ గా ఉన్నప్పుడు ఎంత పొగరు, బలుపు చూపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆడియన్స్ కి పిచ్చి కోపం వచ్చి వీళ్ళని ఎలా అయినా ఎలిమినేట్ చెయ్యాలి అనేలా చేసుకున్నారు. ఇక సెలబ్రిటీలు ఓనర్లు అయ్యారు, ఇక వీళ్ళు సామాన్యులపై విశ్వరూపం చూపిస్తారు, గేమ్ రసవత్తరంగా సాగుతుంది అని అంతా అనుకున్నారు. కానీ వీళ్లంతా ఇప్పుడు బిగ్ బాస్ రూల్స్ ని పూర్తి గా మర్చిపోయారు. టెనెంట్స్ ఎలాంటి అనుమతి లేకుండా మెయిన్ హౌస్ లోకి వస్తున్నారు. కానీ అడిగి రావాలి కదా అని ఒక ఓనర్ కూడా ప్రశ్నించడం లేదు. ముఖ్యంగా సామాన్యులు ఓనర్స్ కి ఆహరం పెట్టే విషయం లో ఎంత డ్రామాలు చేసారో మనమంతా చూసాము.
సంజన గుడ్డు దొంగతనం చేసి తిన్నందుకు ఆ ఆరు మంది సామాన్యులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా గత వారం నామినేషన్స్ ఎపిసోడ్ లో వీళ్లంతా కలిసి ఈ టాపిక్ మీద భరణి ని నామినేట్ చేయడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఒక బాలింత గుడ్డు దొంగతనం చేసి తింటుంటే, చూసి చూడనట్టు ఉన్నందుకు ఇన్ని మాటలు అంటారా అని సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు అనుకున్నారు. ఇన్ని విధాలుగా సెలబ్రిటీలను రాచిరంపాలు పెట్టిన సామాన్యులను ఒక రేంజ్ లో ఆడుకుంటారు ఇక సెలబ్రిటీలు అనుకుంటే, వాళ్ళు టెనెంట్స్ గా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేశారో, ఇప్పటికీ అలాంటి పనులే చేస్తున్నారు. ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విషయం. అంటే ఏంటి?, సెలబ్రిటీస్ నిజమైన మనస్తత్వమే అంత గొప్పదా?, లేకపోతే కెమెరాల ముందు నటిస్తున్నారా అనేది అర్థం అవ్వలేదు.
ముఖ్యంగా ఇమ్మానుయేల్ చాలా అతి చేస్తున్నాడు. సామాన్యులకు ఎలాంటి టాస్క్ ఇవ్వకుండా ఫుడ్ పెట్టకూడదు అనేది గతం లో పెట్టుకున్న రూల్. కానీ ఇమ్మానుయేల్ ఆ రూల్ ని బ్రేక్ చేసి, ప్రియా కి గోరు ముద్దలు తినిపిస్తున్నాడు. ఇది చూసే ఫ్యామిలీ ఆడియన్స్ కి అబ్బో ఇమ్మానుయేల్ ఎంత మంచి వాడో అని అనిపిస్తుంది. ఇమ్మానుయేల్ అలా ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్ల కోసమే ఇలాంటివి చేస్తున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకసారి అయితే పర్వాలేదు, ప్రతీసారీ సందర్భం దొరికినప్పుడల్లా ఇమ్మానుయేల్ ఇలాగే చేస్తున్నాడు. ఇతని నిజమైన స్వభావం అదే అయితే మంచిదే, కానీ బేసిక్ రూల్స్ ని కూడా పాటించనంత తెలివి తక్కువ వాడు కాదు ఇమ్మానుయేల్. కాబట్టి కచ్చితంగా కెమెరాల కోసమే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.