Ramu Rathod Father: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి సెలబ్రిటీస్ జాబితాలో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో ఒకరు రాము రాథోడ్(Ramu Rathod). కటిక పేదరికం నుండి సెలబ్రిటీ స్థాయికి రాము రాథోడ్ ఎలా ఎదిగాడో ప్రతీ ఒక్కరికి తెలుసు. ‘రాను బొంబాయి కి రాను’ అంటూ సాగే పాట ద్వారా రాము రాథోడ్ ప్రపంచం లో ఉన్న మ్యూజిక్ లవర్స్ అందరినీ అలరించాడు. తన సొంత టాలెంట్ తో క్రియేట్ చేసిన పాటకు 500 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ రేంజ్ వ్యూస్ మన టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకు రావడం కూడా కష్టమే. అలాంటిది రాము రాథోడ్ తన సొంత టాలెంట్ తో రప్పించి చూపించాడు. కేవలం ఆ ఒక్క పాట నే కాదు, ఈయన కంపోజ్ చేసిన ‘సొమ్మసిల్లి పోతున్నావే’ పాటకు కూడా 350 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఇలా అంచలంచలుగా ఎదుగుతూ కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవుతున్న రాము రాథోడ్ ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా ఆడియన్స్ కి ఇంకా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సీజన్ మొదలై ఒక వారం రోజులు పూర్తి చేసుకొని రెండవ వారం లోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు జనాలకు చాలా నిజాయితీగా అనిపించిన కంటెస్టెంట్స్ లో ఒకరు రాము రాథోడ్. అబ్బాయి చూసేందుకు చాలా అమాయకంగా ఉన్నాడు, ఎలాంటి కల్ముషం లేదు, మంచి అబ్బాయి అని అనిపించుకున్నాడు. కానీ టాస్కులు వచ్చినప్పుడు మాత్రం చిరుత పులి లాగా ఆడుతున్నాడు అనే పేరు ని కూడా సంపాదించుకున్నాడు రాము రాథోడ్. అయితే తమ బిడ్డ ఇంత ఎత్తుకు ఎదిగి నేడు బిగ్ బాస్ రియాలిటీ షో లో కనిపించడం పై ఆయన తల్లిదండ్రులు ఎంతో ఎమోషనల్ అయ్యారు. రీసెంట్ గానే వీళ్లిద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లో వీళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
రాము తండ్రి మాట్లాడుతూ ‘మాకు చదువు రాదు.. కానీ మా బిడ్డ మమ్మల్ని నేడు గర్వపడేలా చేసాడు. రాము చాలా మంచి వ్యక్తి, అందరికీ నచ్చే వ్యక్తి. అతన్ని ఈరోజు ఇంత స్థాయికి ఎదగడం చూసి గర్వంగా ఉంది. వాడు నవ్వేటప్పుడు మాకు ఎంతో బాగా అనిపిస్తుంది. కానీ గొడవపడేటప్పుడు మాత్రం మా వాడిని ఎదుటి వాళ్ళు తిట్టడం చూసి తట్టుకోలేకపోతున్నాను. వాడు ఎక్కువ రోజులు హౌస్ లో ఉంటూ కప్పు గెలుచుకొని వస్తే మహబూబ్ నగర్ గోపాలపురం మొత్తం డ్యాన్స్ వేస్తూ తిరుగుతాను’ అంటూ చెప్పుకొచ్చాడు రాము రాథోడ్ తండ్రి. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
