Bigg Boss 9 Telugu Pavan Kalyan: బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) మరో రెండు రోజుల్లో ముగియబోతుంది. ఆదివారం రోజున జరగబోయే గ్రాండ్ ఫినాలే తో ఎవరు టైటిల్ విన్నర్ గా నిలబడబోతున్నారో తెలియనుంది. ఏ సీజన్ కి లేనంత ఉత్కంఠ ఈ సీజన్ కి ఉండడం లో కారణం, మొదటి రెండు స్థానాలు ఇంకా ఖరారు కాకపోవడమే. పవన్ కళ్యాణ్, తనూజ మరియు డిమోన్ పవన్, ఈ ముగ్గురి మధ్య టైటిల్ రేస్ ఎవ్వరూ ఊహించనంత రేంజ్ లో జరుగుతుంది. ఆదిమవారం జరగబోయే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ఎవరైనా టైటిల్ గెలవొచ్చు. ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ కి టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. నేడు ఆయనకు సంబంధించిన AV వీడియో టెలికాస్ట్ కాబోతుంది. అందుకు సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేయగా, అది బాగా వైరల్ అయ్యింది.
ఈ ప్రోమో లో బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పే మాటలు వింటే ఆయన అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకుంటాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తలకు గాయం అయ్యింది అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ‘రాజా సాబ్’ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా, ఆ చిత్రం లో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ హౌస్ లోకి అడుగుపెట్టి , టాప్ 5 కంటెస్టెంట్స్ తో ఒక గేమ్ ఆడిస్తుంది అట. కళ్ళకు గంతలు కట్టి,వస్తువులను కనిపెట్టాలి అనేది టాస్క్. ఈ టాస్క్ లో కళ్యాణ్ తలకు గాయమైందని , ఆయన తలకు కట్టు కట్టారని అంటున్నారు. దీంతో కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా సోషల్ మీడియా లో కంటతడి పెట్టుకుంటూ, మా అభిమాన కంటెస్టెంట్ కి ఏమైందో అని బాధపడ్డారు.
కానీ అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే , పవన్ కళ్యాణ్ క్షేమంగానే ఉన్నాడని తెలుస్తోంది. ఆయన తలకు చిన్న గాయం అయిన విషయం వాస్తవమే, అందుకే వెంటనే మెడికల్ రూమ్ కి తరలించి, తగిన చికిత్స చేయడం తో ఆయన పూర్తిగా కోలుకున్నాడని, కానీ తలకు కట్టు మాత్రం కట్టారని తెలుస్తోంది. ఈ కట్టు ఫినాలే ఎపిసోడ్ వరకు ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే హౌస్ లో యాంకర్ శ్రీముఖి, యాంకర్ ప్రదీప్ జంటగా వచ్చారట. టాప్ 5 కంటెస్టెంట్స్ కి తమ అనుభవాలను పంచుకుంటూ రాబోయే బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్స్ సలహాలు ఇస్తూ ఉత్తరాలు రాయాలని, వాటిని భద్రంగా ఒక ఇసుక బాటిల్ లో పెట్టి, వచ్చే సీజన్ కంటెస్టెంట్స్ కి ఇస్తామని చెప్పారట. ఇక తర్వాత ‘దండోరా’ మూవీ ప్రొమోషన్స్ కోసం శివాజీ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది.