Bigg Boss 9 Telugu Tanuja: బిగ్ బాస్ అనేది రియాలిటీ షో అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఇది కేవలం ఒక స్క్రిప్టెడ్ షో అని ఆడియన్స్ కి ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. ఈ సీజన్(Bigg Boss 9 Telugu) లో జరిగినన్ని కుట్రలు, ఏ సీజన్ లో కూడా జరగలేదు. బాగా ఆడుతున్న కంటెస్టెంట్స్ కి హోస్ట్ నాగార్జున నుండి ప్రశంసలు రావడం లేదు. సీజన్ 7 లో ఎలా అయితే ఒక రైతు బిడ్డని విన్నర్ ని చేయడం కోసం సెలబ్రిటీలను బలిపశువుని చేశారో, సీజన్ 9 లో కూడా ఆర్మీ బ్యాక్ డ్రాప్ నుండి వచ్చిన ఒక వ్యక్తిని విన్నర్ ని చేయడం కోసం సెలబ్రిటీలను వాడుకుంటున్నారు. ఒక జవాన్ కి టైటిల్ ఇస్తే కచ్చితంగా బిగ్ బాస్ షో కి ఇంకా మంచి క్రేజ్ వస్తుందని, అదే విధంగా ‘అగ్నిపరీక్ష’ సీజన్ 2 కి మంచి హైప్ వస్తుందని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని విన్నర్ ని చేయడం కోసం నానా తంటాలు పడుతున్నారు.
ఈ వారం పవన్ కళ్యాణ్ ‘టికెట్ టు ఫినాలే’ లో చివరి టాస్క్ తప్ప, మిగిలిన టాస్కులు మొత్తం చాలా కన్నింగ్ ఆలోచనలతో ఆడాడు. తానూ గెలవడం కోసం ఎలా పావులు కదపాలి అని ఆలోచించకుండా, భరణి, సుమన్ లను ఓడించడానికి ఏమి చేయాలి అనే దానిపైనే ఆయన ఎక్కువ శ్రద్ద పెట్టాడు. అందుకోసం ఇమ్మానుయేల్ తో చేతులు కలిపి, అన్యాయంగా బలహీనులను తొలగిస్తూ, చివరికి తమకు అడ్డుగా ఉన్న బలవంతుడు భరణి ని కూడా గేమ్ నుండి తొలగిపోయేలా చేసాడు. పాపా నిజాయితీగా తన తండ్రిని, తన స్నేహితుడిని గెలిపించుకోవడానికి తనకు సంబంధం లేకపోయినా కూడా న్యాయం కోసం పోరాడిన తనూజ ని శనివారం ఎపిసోడ్ లో ప్రతీ విషయం లోనూ టార్గెట్ చేసాడు నాగార్జున. దొంగతనం గా రింగు ని దాచుకొని గేమ్ ని ఆపాలని చూసిన రీతూ చౌదరి ని ఒక్కమాట కూడా అనలేదు.
సరైన ఆకారాల్లో లేని త్రైయాంగిల్స్ ని చూసి, ఇదేమిటి అని ప్రశ్నించిన తనూజ ని మాత్రం దారుణంగా టార్గెట్ చేశారు. ఇకమీదట న్యాయం పక్షాన నిలబడి తన గొంతు ని వినిపించాలి అంటే ఆమె భయపడేలా చేశారు. ప్రతీ వీకెండ్ లో ఆమెని తప్పుబట్టడం, ప్రతీ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో లో ఆమెని నెగిటివ్ చేయడం, ఇలా తనూజ ని టైటిల్ కి దూరం చేసి, నాటకాలు ఆడుతున్న పవన్ కళ్యాణ్ ని టైటిల్ కి దగ్గరగా చెయ్యాలని బిగ్ బాస్ టీం ప్రయత్నం చేస్తుందని ఈ ఘటనలు మొత్తం చూస్తూనే స్పష్టంగా అర్థం అవుతుంది. మూడు వారల క్రితం తనూజ కి 50 శాతం కి పైగా ఓటింగ్ ఉంటే, పవన్ కళ్యాణ్ కి 20 శాతం కన్నా తక్కువ ఓటింగ్ ఉండేది. కానీ ఇప్పుడు బిగ్ బాస్ టీం పవన్ కళ్యాణ్ కి నాన్ స్టాప్ గా పాజిటివ్ ఎపిసోడ్స్ ని ప్లాన్ చేస్తూ టాప్ 53 శాతం తో అతను నెంబర్ 1 స్థానం లో కొనసాగేలా చేసారు. పాపం తనూజ కి మాత్రం కేవలం 40 శాతం ఓటింగ్ మాత్రమే పడుతోంది. ఈ వారం టికెట్ టు ఫినాలే గెలిచి మొదటి ఫైనలిస్ట్ గా పవన్ కళ్యాణ్ నిలవడానికి ముఖ్య కారణం తనూజ. సపోర్టింగ్ టాస్కులలో అతనికి అండగా నిలబడి గేమ్ ఆడి అతన్ని గెలిచి ముందుకెళ్ళేలా చేసింది. అందుకు ప్రశంసలు దగ్గకపోగా, నాగార్జున వైపు నుండి టార్చర్ బదులుగా ఎదురు అవ్వడం శోచనీయం. ఇవన్నీ చూసిన తర్వాత తదుపరి సీజన్స్ కి సెలబ్రిటీలు రావాలంటే భయపడుతున్నారు.