Bigg Boss 9 Telugu Manish: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యుడిగా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో ఒకరు మర్యాద మనీష్. ‘అగ్నిపరీక్ష’ షో లో ఇతను తనకు తానూ చాలా తెలివైన వాడు అనిపించుకున్నాడు. జ్యూరీ కూడా ఇతన్ని తెలివైన వాడిగా పరిగణించేది. ప్రారంభం లో వరుసగా టాస్కులు ఓడిపోతూ వచ్చాడు కానీ, అగ్నిపరీక్ష చివరి రెండు మూడు ఎపిసోడ్స్ లో భారీ కం బ్యాక్ ఇచ్చి తనని తానూ నిరూపించుకున్నాడు. అయితే ఇతను హౌస్ లోకి అడుగుపెట్టడం కష్టమే అని ముందుగా అందరు అనుకున్నారు. కానీ బిగ్ బాస్ 9 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రోజున ఇతన్ని యాంకర్ శ్రీముఖి స్పెషల్ గా హౌస్ లోపలకు పంపింది. హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఇతను ఆడే ఆట తీరు ఎలా ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం.
ఇతనికి ఇతను గొప్ప తెలివైన వాడిలాగా భావిస్తుంటాడు కానీ, ఓవర్ థింక్ చేసే క్యారక్టర్ అని హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాతే తెలిసింది. ఆడియన్స్ కి ఇతని ప్రవర్తన, మూడ్ స్వింగ్స్ చూసి మెంటలెక్కిపొతుంది. ఇతన్ని స్పెషల్ క్యాటగిరీ లో సెలెక్ట్ చేసి లోపలకు పంపినందుకు శ్రీముఖి ని ఆడియన్స్ ప్రతీ రోజు తిట్టుకుంటూనే ఉన్నారు పాపం. అయితే అందరూ అనుకుంటున్నట్టు ఇతను సామాన్యుడు మాత్రం కాదు. మంచి బిజినెస్ మ్యాన్. సినీ ఇండస్ట్రీ లో గొప్ప సర్కిల్ కూడా ఉంది. ఆ సర్కిల్ ని ఉపయోగించుకొనే అగ్నిపరీక్ష లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సర్కిల్ ని వాడుకునే బిగ్ బాస్ 9 హౌస్ లోకి కూడా అడుగుపెట్టాడు. అంతే కాదు గతం లో జెమినీ టీవీ లో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ అనే గేమ్ షో ని నిర్వహించాడు గుర్తుందా ? , ఈ షో లో కూడా ఆయన పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూసేయండి. ఇదంతా పక్కన పెడితే మనీష్ ఇప్పుడు రెండవ వారం నామినేషన్స్ లోకి వచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియా లో జరుగుతున్న ఓటింగ్
ప్రకారం చూస్తే ఆయన ఈ వారం ఎలిమినేట్ అయిపోతాడు. ఒకవేళ అదృష్టం బాగుండి, సేఫ్ అవుతాడేమో అది కూడా చూడాలి. ప్రతీ దానికి ఓవర్ గా ఆలోచిస్తూ ఇతను వదిలే మాటలను ఆడియన్స్ అసలు తీసుకోలేకపోతున్నారు. చూడాలి మరి ఎన్ని రోజులు ఉంటాడు అనేది.