Bigg Boss 9 Telugu Tanuja: టెలివిజన్ రంగంలో పెను సంచలనాన్ని సృష్టించిన రియాల్టీ షో ఏదైనా ఉంది అంటే అది ‘బిగ్ బాస్’ అనే చెప్పాలి. ఇప్పటికే 8 సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ప్రస్తుతం 9వ సీజన్ ను కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తోంది. ఇక ఇలాంటి క్రమంలోనే టెలివిజన్ రంగంలో ఇప్పటివరకు ఏ చానెల్ కి దక్కనటువంటి టిఆర్పి రేటింగ్ ను సంపాదించుకున్న ఛానల్ కూడా ‘స్టార్ మా’ నీ కావడం విశేషం… కేవలం బిగ్ బాస్ షో ద్వారానే ఆ ఘనతని సాధించింది. ఇక బిగ్ బాస్ సీజన్ లో చాలామంది కంటెస్టెంట్స్ వాళ్ల పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నప్పటికి బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం తనూజకి ఎక్కువగా సపోర్ట్ చేస్తోంది అంటూ కొన్ని కామెంట్లైతే వ్యక్తం అవుతున్నాయి. కారణం ఏంటి అంటే ఆమె తన మీద సింపతి వచ్చే విధంగా తను టాస్కులనైతే కంప్లీట్ చేస్తోంది.
అలాగే బిగ్ బాస్ యాజమాన్యం సైతం తనకు కొంతవరకు ఫేవర్ గా మాట్లాడుతున్నారు. ఇదంతా చూస్తుంటే స్టార్ మా లో టెలికాస్ట్ అవ్వబోతున్న కొన్ని సీరియల్స్ లో తనూజ లీడ్ రోల్ లో నటించబోతోంది. కాబట్టి తనకు బిగ్ బాస్ షోలో పాపులారిటీ వస్తే తద్వారా తనను అభిమానించే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది.
ఆ తర్వాత ఆమె చేసే సీరియల్స్ ని కూడా ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉంది. ఇక ఆమె సీరియల్స్ స్టార్ మా లోనే వస్తాయి. కాబట్టి ఆమెను పాపులర్ చేస్తే అది స్టార్ మా లో వచ్చే సీరియల్స్ కి బాగా కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతోనే అలా చేస్తున్నారంటూ కొన్ని కామెంట్లైతే వ్యక్తం అవుతున్నాయి.
నిజానికి మిగతా కంటెస్టెంట్లు ఎవ్వరు కూడా బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత స్టార్ మా కి వాళ్లతో ఎలాంటి యూజ్ ఉండదు. కాబట్టి తనూజ ని హైలెట్ చేస్తే వాళ్లకి కొంతవరకు హెల్ప్ అవుతోందనే ఉద్దేశ్యంతో అలా చేస్తున్నారు అంటూ కొంతమంది కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు. కానీ బిగ్ బాస్ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని చూస్తుంటే మాత్రం తనూజకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న విధానం ఎవరికీ నచ్చడం లేదు…