Bigg Boss 9 Telugu Latest Update: కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమోలు కూడా ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి. ఇంతకూ ముందు సీజన్స్ లో లేనిది, ఈ సీజన్ లో ఉన్నది ఒక్కటే భారీ తేడా. ఈ సీజన్ లో బిగ్ బాస్ టీం సామాన్యులకు కూడా హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టే అద్భుతమైన అవకాశం కల్పించారు. అందుకోసం దరఖాస్తులు కూడా స్వీకరించారు. వేల అప్లికేషన్స్ నుండి కేవలం 40 మందిని ఎంపిక చేశారు. ఈ 40 మందికి బిగ్ బాస్ అగ్నిపరీక్ష అనే కాంటెస్ట్ ద్వారా టాస్కులు నిర్వహించి, కేవలం 8 మందిని మాత్రమే సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతారు. హౌస్ లోకి వెళ్లిన తర్వాత సెలబ్రిటీలకు, సామాన్యులకు జరిగే పోటీ లో ఎవరు గెలుస్తారు అనేది పాయింట్.
Also Read: ఆ స్టార్ హీరోకి కి మానసిక రోగం ఉందా..? అసలు ఏమైందంటే!
కానీ ఇక్కడ బిగ్ బాస్ టీం పెద్ద మోసం చేస్తుందని కొందరు విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. బిగ్ బాస్ టీం సామాన్యులను ఎంపిక చేసుకుంటాము అని చెప్తూనే, ఇన్ స్టాగ్రామ్ సెలబ్రిటీలను, యూట్యూబర్స్ ని, ఫ్లాప్ సినిమాల హీరోయిన్స్ ని ఎంచుకుంటున్నారని, ఇది అసలు ఏమాత్రం న్యాయం కాదని, ఇలా అయితే బిగ్ బాస్ షో కి ఉన్న రియాలిటీ ని జనాలు నమ్మే పరిస్థితులు ఉండవని మండిపడ్డారు. వాళ్ళు అలా మండిపడడానికి ఒక కారణం ఉంది. రీసెంట్ గానే అగ్నిపరీక్ష కి సంబంధించిన ఒక చిన్న ప్రోమో ని విడుదల చేశారు. ఈ ప్రోమో లో రేఖా భోజ్(Rekha Bhoj) అనే హీరోయిన్ కూడా ఉంది. వైజాగ్ కి చెందిన ఈ తెలుగు అమ్మాయి గతం లో దామిని విల్లా, రంగెలా, కల్యాణ తస్మై వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పటి వరకు ఆమె ఎక్కువగా బోల్డ్ పాత్రల్లోనే కనిపించింది.
Also Read: నాగార్జున కొట్టిన దెబ్బలకు ముఖం వాచిపోయింది… హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఇన్ స్టాగ్రామ్ లో ఈమెకు దాదాపుగా నాలుగు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈమె పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. సినీ నటిగా కంటే కూడా ఆమె ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమాని గానే పాపులారిటీ ని సంపాదించింది. 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కోసం జనసేన తరుపున ఎండల్లో తిరుగుతూ ప్రచారం కూడా చేపట్టింది. అలా సెలబ్రిటీగా అందరికి తెలిసిన ఈమె సామాన్యుల క్యాటగిరీలో అడుగుపెట్టడం గమనార్హం. గత సీజన్స్ లో కూడా ఈమెకు బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశాలు వచ్చాయి. కానీ ఎందుకో కొన్ని కారణాల వల్ల మిస్ అయ్యింది. ఈసారి మాత్రం మిస్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. ఈమె లాగానే అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య, ఉప్పల్ బాలు వంటి వారు కూడా సామాన్యుల క్యాటగిరీ లో హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు.