Bigg Boss 9 Telugu Scripted: టెలివిజన్ రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసిన రియాల్టీ షో ఏదైనా ఉంది అంటే అది ‘బిగ్ బాస్ షో’ అనే చెప్పాలి. ఇండియా లో ఇప్పటివరకు ఈ షో అన్ని భాషల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది…ఇక ఆయా రాష్ట్రాల్లో ఏ హీరో అయితే ఫామ్ లో ఉంటాడో అతని చేత హోస్టింగ్ చేయిస్తూ ఈ షో లను టాప్ పొజిషన్ లో నిలిపారు. ఇంకా తెలుగులో సైతం మొదట ఎన్టీఆర్ తో స్టార్ట్ చేసిన ఈ గేమ్ షో ఆ తర్వాత నాని ను కొన్ని సీజన్లు చేశాడు. ఇప్పుడు నాగార్జునతో కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకు ఎనిమిది సీజన్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ యాజమాన్యం తొమ్మిదోవ సీజన్ కోసం భారీ కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతోంది…ఇక ఇదిలా ఉంటే సామాన్యులను సైతం బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్స్ గా తీసుకురావాలనే ఆలోచన అయితే బాగుంది. ఇక దానికోసమే అగ్ని పరీక్ష అనే ఒక షో స్టార్ట్ చేసి అందులో కొన్ని టాస్కులను కంటెస్టెంట్లకు ఇచ్చి వాటిని సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేసిన వారిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇది వినడానికి బాగానే ఉన్నప్పటికి అగ్ని పరీక్ష షో మొత్తం స్క్రిప్టెడ్ గా నడుస్తుందని ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వాళ్లు కొంతమందికి పక్షపాతం వహిస్తూ వాళ్లవైపే మద్దతుగా మాట్లాడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు..నార్త్ అమెరికా లో ఫైర్ స్ట్రోమ్!
మిగతా కంటెస్టెంట్స్ వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేసిన కూడా వాళ్ళకి రెడ్ మార్కును ఇచ్చి వాళ్ళను హోల్డ్ లో పెడుతున్నారు తప్ప గ్రీన్ మార్క్ ఇచ్చి వాళ్ళని క్వాలిఫై అయ్యే విధంగా అయితే చేయడం లేదంటూ ఈ షో ను చూస్తున్న చాలామంది దీనిమీద నెగెటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు…
మొత్తానికైతే 45 మందిలో ఎవరో ఐదుగురిని ముందుగానే షో యాజమాన్యం సెలెక్ట్ చేసిందని దానికోసమే ఇదంతా ఒక స్క్రిప్ట్ లా రాసుకొని చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ను వాడుకుంటూ బిగ్ బాస్ షో కి ముందు దీని ద్వారా ఒక హైప్ ని క్రియేట్ చేస్తే బిగ్ బాస్ సీజన్ 9 కి భారీ క్రేజ్ వస్తుందనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి ఒక షోని కండక్ట్ చేస్తున్నారంటూ పలువురు నెటిజన్లు సైతం ఈ షో మీ ద భారీ విమర్శలైతే చేస్తున్నారు…
ఇక జడ్జీలు గా ఉన్న నవదీప్ , అభిజిత్, బిందు మాధవిలు సైతం ఆర్మీ పవన్ కళ్యాణ్ మీద గానీ, సిద్దిపేట మోడల్ ను చిన్న చూపు చూస్తూ ఏదో విధంగా వాళ్ళను డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుతూ వాళ్లకు రెడ్ మార్క్ అనేది ఇచ్చారు. మరి ఇలాంటి సంఘటనలు జరగడం వల్లే ఈ షో మీద కొంతవరకు ప్రేక్షకులకు నమ్మకం పోయిందని ఇదంతా స్క్రిప్టెడ్ షో అంటూ భారీ కామెంట్లు అయితే చేస్తున్నారు…